KGF చాప్టర్ 1 తెలుగు టీవీ ఛానల్ లో ప్రసారం – లీగల్ యాక్షన్ కు సిద్దమైన చిత్ర నిర్మాతలు

0
KGF చాప్టర్ 1 తెలుగు టీవీ ఛానల్ లో ప్రసారం

KGF చాప్టర్ 1 తెలుగు టీవీ ఛానల్ లో ప్రసారం. యష్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘KGF చాప్టర్ 1’ తెలుగు వర్షన్
చట్టవిరుద్ధంగా ఒక తెలుగు లోకల్ టీవీ ఛానల్ లో ప్రసారం చేశారని ఆ చిత్ర మేకర్స్ ఆరోపించారు.

every అనే లోకల్ తెలుగు ఛానల్ ప్రసారం చేసిన ఈ చిత్రం స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ క్రియేటివ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత కార్తీక్ గౌడ ఇలా స్పందించారు. “ఒక తెలుగు కేబుల్ ఛానల్ (every) చట్టవిరుద్ధంగా KGF చిత్రాన్ని ప్రసారం చేస్తుంది. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాము, దాదాపు సాటిలైట్ హక్కులు ఖరారు అవుతున్న సమయంలో ఆ కేబుల్ ఛానెల్ ఇలా చేసింది, అందుకు తగ్గ ఆధారాలు మా దగ్గర (స్క్రీన్ షాట్లు, వీడియో క్లిప్స్) ఉన్నాయి. ”

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘యష్’ కథానాయకుడిగా నటించిన ‘KGF చాప్టర్ 1’ పలు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్. పలు రాష్ట్రాల్లో విశేష ప్రజాదరణ సాధించింది ఈ చిత్రం. భారత చిత్ర పరిశ్రమలో ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన వాటిలో ఒకటి నిలిచింది ఈ చిత్రం. దాదాపుగా 250కోట్లు వసూలు చేసింది ప్రపంచవ్యాప్తంగా.

అభిమానులు ‘KGF చాప్టర్ 2’ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న చాప్టర్ 2 చిత్రం కరోనా ప్రభావం తగ్గితే దసరా పండగకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. బాలీవుడ్ సంజయ్ దత్ ప్రతి నాయకుడుగా ఈ చిత్రంలో కనిపించనున్నాడు. అలాగా హిందీ నటి రవీనా టాండన్ కూడా ముఖ్య పాత్రలో కనిపించనుంది.

KGF చాప్టర్ 1 తెలుగు టీవీ ఛానల్ లో ప్రసారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here