Konda Devara Song Lyrics – Game Changer Telugu Song

0
Konda Devara Song Lyrics

Konda Devara Song Lyrics గేమ్ చేంజర్ సినిమాలోనిది. ఈ పాటకు సాహిత్యం కాసర్ల శ్యామ్ అందించగా, థమన్ సంగీత సారథ్యంలో థమన్ మరియు శ్రావణ భార్గవి ఆలపించారు ఏ పాటను.

Konda Devara Song Credits

MovieGame Changer (10-01-2025)
DirectorShankar
ProducersDil Raju, Shirish
SingersThaman S, Sravana Bhargavi
MusicThaman S
LyricsKasarla Shyam
Star CastRam Charan, Kiara Advani
Music Label & SourceSaregama Telugu

Konda Devara Song Lyrics

నెత్తురంత ఉడుకుతున్న
ఊరువాడ జాతర…
వాడు మీద పడ్డడంటే
ఊచ ఊచకోతర…
కొండ దేవర… కొండ దేవర

ఎత్తుకెళ్ళ వచ్చినోళ్ల దండు
ఉప్పు పాతర…
తన్ని తన్ని దుండగుల్ని
తరుముదాము పొలిమేర
కొండ దేవర… కొండ దేవర

కొండ దేవరా… కొండ దేవరా
కొండ దేవరా… నేల గాలి మాది
కొండ దేవరా… మట్టి తల్లి మాది
కొండ దేవరా… నీరు నిప్పు మాది
కొండ దేవరా… కొండ కోన మాది

ఎర్ర ఎర్ర సూర్యున్నేమో
బొట్టునాల దిద్ది
వెలుగు నింపినావు బతుకునా
నల్ల నల్ల మబ్బులోన ఎండి ఎన్నెలద్ది
ఊయలూపినావు జోలనా…

హే, మా నిన్న మొన్న
మనమంటే, నువ్వే
వేయి కన్నులున్న… బలగం నువ్వే
నువ్ ఉంటావమ్మా… ఇయ్యాల, రేపు

మా వెన్నుదన్ను మార్గం చూపే
హే, పాడు కళ్ళు సూడు
తల్లి గుండె తప్ప ఈడకొచ్చినాయిరా
హే, ఎల్లగొట్టుదాము విల్లు ఎత్తినాము
బెల్లుమంటు దూకదా..?

కొండ దేవరా… కొండ దేవరా
కొండ దేవరా… కొండ దేవరా
కొండ దేవరా… నేల గాలి మాది
కొండ దేవరా… మట్టి తల్లి మాది

కొండ దేవరా… అండ నీవురా
కొండ దేవరా, ఆ ఆ… గుండె నీదిరా
కొండ దేవరా… అండ నీవురా
కొండ దేవరా, ఆ ఆ… గుండె నీదిరా

Watch కొండ దేవర Song

Devender
I am Devender, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here