Home » Bathukamma Songs Lyrics » Koppuloni Puvvamma Lyrics – Mangli Bathukamma Song 2023

Koppuloni Puvvamma Lyrics – Mangli Bathukamma Song 2023

by Devender

Koppuloni Puvvamma Lyrics penned by Kasarla Shyam, music composed by Suresh Bobbili, and sung by Mangli. మంగ్లీ 2023 బతుకమ్మ సాంగ్.

Koppuloni Puvvamma Song Credits

Song Category Bathukamma Song
Lyrics Kasarla Shyam
Singer Mangli
Music Suresh Bobbili
Song Lable Mangli Official

Koppuloni Puvvamma Lyrics

కొప్పూలోని పువ్వమ్మ
బాయీకాడి బొడ్డెమ్మా
కొప్పూలోని పువ్వమ్మ
బాయీకాడి బొడ్డెమ్మా

గంగా దాటి పోకమ్మో
గంగీ బాలి కమలమ్మ
గంగా దాటి పోకమ్మో
గంగి బాలి కమలమ్మ

చేనుగట్ల పువ్వమ్మా
ఉశికేలోని గౌరమ్మ
చేనుగట్ల పువ్వమ్మా
ఉశికేలోని గౌరమ్మ

శిబ్బీ మర్శిపోకమ్మో
దబ్బూమంటు కాంతమ్మ
శిబ్బీ మర్శిపోకమ్మో
దబ్బూమంటు కాంతమ్మ

పెద్దామాస పొద్దుల్లో
రాగి వన్నె మబ్బుల్లో
అడుగే పెడితే మా తల్లో
పసుపు పచ్చ ఎన్నెల్లో
ముంగిట ముగ్గు సుక్కల్లో
ఎంగిలి పూల బతుకమ్మలో

కొప్పూలోని పువ్వమ్మ
బాయికాడి బొడ్డెమ్మా
గంగా దాటి పోకమ్మో
గంగి బాలి కమలమ్మ

రెండో నాడు రేణమ్మ
అటుకూలిస్త లక్ష్మమ్మ
రెండో నాడు రేణమ్మ
అటుకూలిస్త లక్ష్మమ్మ

మూడో నాడు ముత్తంత
ముద్ధాపప్పు దేశాంతా
నాల్గొద్ధులల్ల సందేళ్లు
నానేసి బియ్యమియ్యుల్లో
నాల్గొద్ధులల్ల సందేళ్లు
నానేసి బియ్యమియ్యుల్లో

ఐదో తనము కైలమ్మ
అట్లూ జేసి పెట్టమ్మా
ఐదో తనము కైలమ్మ
అట్లూ జేసి పెట్టమ్మా

అర్రెంగేల రాజమ్మ
అలిగీ ఉండె గౌరమ్మ
నైవేధ్యాలు వద్దమ్మా
నెలకీ పూజ సాలమ్మ
ఏడూ ఏపకాయల్లో
తోడూ వచ్చు పుణ్యాలో

అన్నాదమ్ములిండ్లల్లో
సున్నాలేశె కాంతుల్లో
గడపా కడగవే పిల్లో
కోరీ దీవెనార్ధుల్లో

కొప్పూలోని పువ్వమ్మ
బాయికాడి బొడ్డెమ్మా
గంగా దాటి పోకమ్మో
గంగి బాలి కమలమ్మ

ఎండీ గిన్నె ఎతకమ్మా
ఎన్నాముద్ద చిలకమ్మా
ఎండీ గిన్నె ఎతకమ్మా
ఎన్నాముద్ద చిలకమ్మా

ఎనిమీదింట నువ్వుల్లో
ఎలుగూ జల్లులోయమ్మ
పైడీ గొలుసు ఊయల్లో
పగడాలంటి పాపల్లో
పైడీ గొలుసు ఊయల్లో
పగడాలంటి పాపల్లో

నిండా తొమ్మిదొద్దుల్లో
పండే నోచె నోముల్లో
నిండా తొమ్మిదొద్దుల్లో
పండే నోచె నోముల్లో

గునుగూ పూల మేనాలో
గురిగీ తంగేడు పూలో
సత్తూ ముంత సారెల్లో
తరలీపోయె అత్తిల్లో
వాయినాలు పంచంగా
యాడాది ఎదురు సూడంగా

కొప్పూలోని పువ్వమ్మ
బాయీకాడి బొడ్డెమ్మా
కొప్పూలోని పువ్వమ్మ
బాయీకాడి బొడ్డెమ్మా
గంగా దాటి పోకమ్మో
గంగీ బాలి కమలమ్మ

పోయీ రావె బతుకమ్మో
బతుకుదెరువు గంగమ్మ
పోయీ రావె బతుకమ్మో
బతుకుదెరువు గంగమ్మ

నీళ్ళా కొంగు సాపిందే
తోల్కాపోను మాయమ్మా
నీళ్ళా కొంగు సాపిందే
తోల్కాపోను మాయమ్మా

Watch Mangli Bathukamma Song 2023 Video Song

You may also like