రాంగోపాల్ వర్మ ఇచ్చిన ఒక ట్వీట్ కు తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు మంత్రి కేటీఆర్. అటు వర్మ ఇటు కేటీఆర్ లు ట్విట్టర్ లో చాలా ఆక్టివ్ గా ఉంటారు. కాకుంటే ఎప్పుడు ప్రత్యక్షంగా ఇద్దరూ మాట్లాడుకున్న సందర్భాలు లేవు.
రాంగోపాల్ వర్మ ట్వీట్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన కేటీఆర్
విషయం ఏంటంటే, లాక్‌డౌన్ వేళ మందు దొరకక కొంత మంది ఇబ్బంది పడుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి స్పందించి హోమ్ డెలివరీకి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. మద్యం దుకాణం యజమానులు తమ అనుబంధ పోలీస్ స్టేషన్ ద్వారా పాసుల కొరకు సంప్రదించాలి. ఒక లిక్కర్ షాపు కేవలం మూడు డెలివరీ పాసులు మాత్రమే పొందగలరు.
అయితే ఇదే విషయాన్నీ ట్విట్టర్ లో ప్రస్తావిస్తూ కెసిఆర్, కేటీఆర్ మరియు జగన్ లను ట్యాగ్ చేశాడు వర్మ. విసుగు చెందిన కొందరు, జుట్టు పీక్కోవడం, చిన్న పిల్లల్లా ఏడవడం, మానసిక ఆసుపత్రులలో చేరడం మరియు నిరాశతో భార్యల మీద దాడి చేయడం లాంటివి జరుగుతున్నాయి, కావున మమతా బెనర్జీ లాగా మీరు కూడా చాలా …… పెద్ద హృదయం చేసుకొని మమ్ముల్ని కొంచెం సంతోష పర్చండి, ఇది నా వినయపూర్వకమైన అభ్యర్థన అని కోరాడు రాంగోపాల్ వర్మ.
ఇందుకు స్పందించిన మంత్రి కేటీఆర్, ఇలా ట్వీట్ చేశారు… రాము గారు మీరు జుట్టు కత్తిరింపుల గురించి మాట్లాడుతున్నారా? అని ఫన్నీ గా ట్వీట్ చేశారు.
రాంగోపాల్ వర్మ ట్వీట్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన కేటీఆర్
Ramu Garu, You are talking about hair cuts I presume ? 🤔 https://t.co/6cyQqX3c7g
— KTR (@KTRTRS) April 10, 2020