Home » Folk Lyrics » Ku Ku Kumari Song Lyrics – Amardeep | Vishnupriya

Ku Ku Kumari Song Lyrics – Amardeep | Vishnupriya

by Devender

Ku Ku Kumari Song Lyrics, శేఖర్ మ్యూజిక్ ఛానల్ నుండి విడుదలైన మరో ఫోక్ సాంగ్. సాయి ప్రసాద్ పూజారి సాహిత్యానికి సాకేత్ మరియు స్ఫూర్తి జితేందర్ పాడిన కు కు కుమారి పాటకు మదీన్ సంగీతాన్ని అందించగా, అమర్ కు జోడిగా విష్ణుప్రియ అద్భుతంగా నర్తించారు. కిలికి లిరిక్స్ స్ఫూర్తి అందించారు.

Ku Ku Kumari Song Credits

ProducersShekher, Ravi Peetla
SingersSaketh Komanduri, Spoorthi Jithender
MusicMadeen SK
LyricsSai Prasad Poojari
Star CastAmardeep Chowdary, Vishnupriya Bhimeneni
Video LabelSekhar Music

Ku Ku Kumari Song Lyrics

నా కుకు నిన్న వొడ్డు వాక
అల్లి వాక లంబా లంబా
ఆకురంభ నియ్యా జీకే
వాహ చిప్ల టంబ టంబ…
గునుపు టుల్లు టుల్లు
జోనులు హులులు లు లు
సిక్కి వక్క…
కుకు కుకుకు కుకు…

లష్కర్ జాతర్లనా.. ఆర్మూరం గట్లనా
తిరుపతి తిరునాళ్ళనా… అమెరికా ఆగంట్లనా

కు కు కుమారి సీరలేడ కొన్నవే
సీకటైన మిలమిలమిల మెరుస్తున్నయే
కు కు కుమారి సీరలేడ కొన్నవే..?
సీకటైన మిలమిలమిల మెరుస్తున్నయే

ఆ కంచివరముకు… గా గద్వాల్ సీరకు
ఉప్పాడ పట్టుకు… సిద్ధిపేట సీరకు

పో పో పోకిరి పేరు నేనే దెచ్చినా
నేను కట్టుకొని అన్నిటిని ఫేమస్ జేసినా
పో పో పోకిరి పేరు నేనే దెచ్చినా
నేను కట్టుకొని… అన్నిటిని ఫేమస్ జేసినా

చిరుగాలికి సీరెగురుతుంటే… యెహె యెహె యెహెయ్
కు కు కుమారి… కెవ్వు కేక ఉన్నవే
బొట్టు పెట్టుకున్న… బుట్ట బొమ్మలెక్కగున్నవే
కు కు కుమారి సీరలేడ కొన్నవే..?
సీకటైన మిలమిలమిల మెరుస్తున్నవే

ఆ సందమామను… ఆ వెండి సుక్కను
గా మెరుపు తీగను… రంగుల హరివిల్లును
కు కు కుమారి… బువ్వ లెక్క తిన్నవా
నీ బుగ్గలు బూరెడు పూవుల లెక్క వున్నయే, హెయ్

చింతపండు పిసుకుతూ
నిమ్మకాయ పిండుతూ
ఇంగువాను సల్లుతూ
పులిహోర కలుపుతూ…

పో పో పోకిరి… నీలా మస్తు గిలికిరీ
అందరిని మడత వెట్టి జేశ్న ఇస్తిరీ
పో పో పోకిరి… నీలా మస్తు గిలికిరీ
అందరిని మడత వెట్టి జేశ్న ఇస్తిరీ

నీ కోపమెంత ముద్దుగుందే, యే యె ఉమ్మ
కు కు కుమారి సుర్రు సూపరున్నవే
సూపుతోని దిల్ కసకస నరుకుతున్నవే…

నా కుకు నిన్న వొడ్డు వాక
అల్లి వాక లంబా లంబా
ఆకురంభ నియ్యా జీకే
వాహ చిప్ల టంబ టంబ…
గునుపు టుల్లు టుల్లు
జోనులు హులులు లు లు
సిక్కి వక్క…
కుకు కుకుకు కుకు…

ఏనుగెక్కి వస్తనే
ఎదురు కట్నమిస్తనే
ఏలు పట్టుకుంటనే
నిన్ను ఏలుకుంటనే

కు కు కుమారి పెండ్లి చేసుకుంటనే
ఏడు అడుగులేసి మెడల మూడు ముళ్ళు గడ్తనే
కు కు కుమారి పెండ్లి చేసుకుంటనే
ఏడు అడుగులేసి మెడల మూడు ముళ్ళు గడ్తనే, హే హేయ్

నీ మాయ మాటలు
నీ చిలిపి చేష్ఠలు
నీ కొంటె సూపులు
తెచ్చినాయి నవ్వులు

కు కు కుమారి మనసు దోచినావురా
మణికట్టుకు మల్లెలు సుట్టుకోని ఉరికిరా
కు కు కుమారి మనసు దోచినావురా
మణికట్టుకు మల్లెలు సుట్టుకోని ఉరికిరా

గట్లుంటదే మనతోని మరి
కుకు కుకు కుకు

కు కు కుమారి మురళీకృష్ణుని నేను
అనుకుంటే ముద్దు పెటేదాకా నిద్దురపోను
కు కు కుమారి మురళీకృష్ణుని నేను
అనుకుంటే ముద్దు పెటేదాకా నిద్దురపోను

Watch కు కు కుమారి Video Song

You may also like

Leave a Comment