మే 6 నుండి తెలంగాణాలో మద్యం అమ్మకాలు మొదలు కానున్నాయని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన చేశారు. ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
మే 6 నుండి తెలంగాణాలో మద్యం అమ్మకాలు
మే 5న నిర్వహించిన ప్రెస్ మీట్ లో కెసిఆర్ మాట్లాడుతూ తెలంగాణాలో రేపటి నుండి (మే 6, బుధవారం) మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చు అని, అయితే కంటైన్మెంట్ జోన్లు మినహా రెడ్ మరియు ఆరెంజ్ జోన్లలో కూడా దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు.
మద్యం కొనే వారు తప్పక భౌతిక దూరం పాటించాలని, అందుకు షాప్ యజమానులు చొరవ చూపాలని, అలా కాకుండా నిబంధనలను గాలికి వదిలేస్తే క్షణాల్లో సీజ్ చేస్తామని హెచ్చరించారు. నో మాస్క్ నో లిక్కర్ విధానాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందేనని అన్నారు.
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచుతారు. బార్‌లు, పబ్‌లు, క్లబ్‌లకు మాత్రం అనుమతి లేదు. చీప్ లిక్కర్ పై 11% మరియు ఇతర మద్యంపై 19% అధిక రేట్లు ఉంటాయి.