Maa Oori Jatharalo Song Lyrics – మా ఊరి జాతరలో లిరిక్స్, బచ్చల మల్లి

Maa Oori Jatharalo Song Lyrics

Maa Oori Jatharalo Song Lyrics శ్రీమణి అందించగా, విశాల్ చంద్రశేఖర్ స్వరకల్పనలో గౌర హరి మరియు సింధూరి విశాల్ పాడిన ఈ పాట బచ్చల మల్లి చిత్రంలోనిది.

Maa Oori Jatharalo Song Lyrics in English

Maa Oori Jatharalo
Kaatuka Kallatho
Chaatuga Rammani
Saige Chese Chinnadhi…

Vaamu Kaada Varasagatti
Manche Meena Muddhuletti
Vandhella Kougilallukuntaanandi Pilladi.

Maa Oori Jatharalo Song Lyrics in Telugu

మా ఊరి జాతరలో
కాటుక కళ్ళతో
చాటుగ రమ్మని
సైగే చేసే చిన్నది…

వాము కాడ వరసగట్టి
మంచె మీన ముద్దులెట్టి
వందేళ్ల కౌగిలల్లుకుంటానంది పిల్లది

ఆ బ్రహ్మే రాసే రాతలన్ని ఆపి
రాసాడే పెళ్లి శుభలేఖ
ఆకాశం సొంత చుట్టమల్లే మారి
నేసిందే మల్లెపూల పడక…

రాములోరు పేర్చిన, ఆహ
రాళ్ళు ఏరి తీయనా, ఓహో
ఏటి నీటి పైనే నీకు
కోటే కట్టెయ్‍నా..!
నీటిలోన చేపలే, ఊహు
కాపలాగ ఉంచనా, ఊహు
నింగి నేల ఎన్నడు చూడని
రాణిని చేసేయ్‍నా…

ఎహె రాణి వాసమంటే
అసలు ఇష్టం లేదు నాకు
నీ కోట కోసం ఎళ్ళి
రామసేతును కదపమాకు
నీకర్ధం కావట్లేదా
మరి నాకేం కావాలో..?

యుద్ధం చేసి తెల్లోళ్ళపైనా
కోహినూరుని తెచ్చి కానుకిచ్చేయ్‍నా
వెన్నెలంటి సిన్నవాడి
కోరచూపు ముందర
వజ్రం వైడూర్యం సాటేనా..!

సరే పోనీ ఎంత ఖర్చే అయినా గానీ
ఏడు వింతల్లో లేనధ్బుతాన్ని
నీకోసం తెచ్చి ఇస్తానే పిల్లో…
అరె బాబు..! నీ మాటే నీదే గాని
నీకర్ధం కాలేదా
నిజంగా… మరి నాకేం కావాలో?

కాలి అందే ఘల్లుమని
చిన్ని గుండె ఝల్లనే
సోయగాల జల్లులో
తడిసిందిరో నా మది

చలి చంపేసే… స్నానల వేళ
వెచ్చని ఊపిరి సెగల
చలి మంటేసెయ్‍నా…
మీసమొచ్చి గుచ్చుతుంటే
వీసమెత్తు సోయగం
రాజేసుకుంటే ఆడేనా…

పిల్లదాన నా ఊహల సంచిలోన
ఉన్నవన్ని పంచుకున్న
ఇవి చాల్లేదంటే ఇంకేం కావాలే…
ప్రేమించి తాళి కట్టించుకున్నాక
అర్ధభాగం నువ్విచ్చాక
అంత కంటే కానుక… లేదుగా
ఊహలు ఆపేసెయ్ ఇంకా

ఆ బ్రహ్మే వేసే ముడులు అన్ని ఆపి
వేసాడే మీకు కొంగు ముడినే
ఆకాశం తానే శిల్పిలాగ మారి
చెక్కిందే మీకు ప్రేమ గుడినే…

Watch మా ఊరి జాతరలో Lyrical Video

Maa Oori Jatharalo Song Lyrics Credits

Bachhala Malli 
DirectorSubbu Mangadevi
ProducersRazesh Danda, Balaji Gutta
SingersGowra Hari, Sinduri Vishal
MusicVishal Chandrashekhar
LyricsShree Mani
Star CastAllari Naresh, Amritha Aiyer
Music Label & Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *