మిట్టపల్లి అమ్మ పాట, హృదయాన్ని తాకేలా లిరిక్స్

Mittapalli Amma Paata Lyrics

రచయిత మిట్టపల్లి సురేందర్ హృదయానికి హత్తుకునే పాటలు రాయడంలో ఆయనకు ఆయనే సాటి. అతని కలం నుండి జాలువారిన అమ్మ పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా అమ్మలాగే అమృతంలా ఉంది.

అదే విధంగా జాహ్నవి స్వరంలో ఈ పాట ప్రతి ఒక్కరికి అమ్మను గుర్తు చేస్తుంది. సిస్కో డిస్కో సంగీతం కూడా పాటకు మరింత ఉపయోగపడింది. ఈ పాట లిరిక్స్ మీకోసం…

Mittapalli Amma Paata Lyrics

అమ్మపాడే జోలపాట
అమృతానికన్నా తియ్యనంట
అమ్మపాడే లాలిపాట
తేనెలూరి పారే ఏరులంట

నిండు జాబిలి చూపించి
రెండు బుగ్గలు గిల్లేసి
నిండు జాబిలి చూపించి
గోటితో బుగ్గను గిల్లేసి

ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మ లాలన
ఊపిరిపోసే నూరేళ్ల నిండు దీవెన
అమ్మపాడే జోలపాట
అమృతానికన్నా తియ్యనంట

కురిసే వాన చినుకులకి
నీలినింగి అమ్మ
మొలిచే పచ్చని పైరులకి
నేలతల్లి అమ్మ ||2||
వీచే చల్లని గాలులకి
పూలకోమ్మ అమ్మ
ప్రకృతిపాడే పాటలకి
యలకోయిల అమ్మ

సృష్టికి మూలం అమ్మతనం
సృష్టికి మూలం అమ్మతనం
సృష్టించలేనిది అమ్మ గుణం

అమ్మపాడే జోలపాట
అమృతానికన్నా తియ్యనంట
అమ్మపాడే లాలిపాట
తేనెలూరి పారే ఏరులంట

నింగిని తాకే మేడలకి
పునాది రాయి అమ్మ
అందంపొందిన ప్రతి శిలకి
ఉలిగాయం అమ్మ ||2||
చీకటి చెరిపే వెన్నెలకి
జాబిల్లి అమ్మ
లోకం చూపే కన్నులకి
కంటిపాప అమ్మ

అమ్మంటే అనురాగ జీవనీ
అమ్మంటే అనురాగ జీవని
అమ్మ ప్రేమే సంజీవని

అమ్మపాడే జోలపాట
అమృతానికన్నా తియ్యనంట
మమ్మ… అమ్మపాడే లాలిపాట
తేనెలూరి పారే ఏరులంట

నిండు జాబిలి చూపించి
రెండు బుగ్గలు గిల్లేసి
నిండు జాబిలి చూపించి
గోటితో బుగ్గను గిల్లేసి

ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మ లాలన
ఊపిరిపోసే నూరేళ్ల నిండు దీవెన

అమ్మపాడే జోలపాట
అమృతానికన్నా తియ్యనంట
మా అమ్మపాడే లాలిపాట
తేనెలూరి పారే ఏరులంట

Watch అమ్మపాడే జోలపాట Video Song

Mittapalli Amma Paata Lyrics Credits 2024

LyricsMittapalli Surender
SingerJanhavi Yerram
MusicSisco Disco
Music Lable & Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *