Namo Namah Shivaya Lyrics జొన్నవిత్తుల అందించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి అనురాగ్ కులకర్ణి మరియు హరిప్రియ ఆలపించిన పాట ‘తండేల్’ చిత్రంలోనిది. గీత ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం నుండి రెండో పాటను ఈరోజు విడుదల చేశారు. మొదటి పాట ‘బుజ్జి తల్లి’కి మంచి స్పందన రాగ, పురాతన శ్రీముఖలింగం శివాలయాన్ని ప్రతిబింబించేలా నమో నమః శివాయ పాటను తీర్చిదిద్దారు. నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Namo Namah Shivaya Song Credits
Movie | Thandel (07/02/2025) |
Director | Chandoo Mondeti |
Producer | Bunny Vas |
Singer | Anurag Kulkarni, Haripriya |
Music | Devi Sri Prasad |
Lyrics | Jonnavithula |
Star Cast | Naga Chaitanya and Sai Pallavi |
Music Label & Source | Aditya Music |
Namo Namah Shivaya Lyrics
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ…!
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ…!
నమో నమః… నమో నమః
నమో నమః శివాయ
నమో నమః… నమో నమః
నమో నమః శివాయా
హే, ఢమ ఢమ ఢం అదరగొట్టు
ఢమరుకాన్ని దంచికొట్టు
అష్టదిక్కులదిరేటట్టు తాండవేశ్వరా..
(నమో నమః
నమో నమః
నమో నమః శివాయ)
భం భం భం మొదలుపెట్టు
అమృతాన్ని పంచిపెట్టు
గుండె వెండికొండయేట్టు
కుండలేశ్వరా…
(నమో నమః
నమో నమః
నమో నమః శివాయ)
జై శంకర… జై జై జై శంకర
నిప్పు కన్ను ఇప్పి
జనం తప్పును కాల్చేయ్యరా
జై శంకర… శివ శివ శివ శంకర
త్రిశూలం తిప్పి సూపి
మంచి దారి నడపరా…
(నమో నమః
నమో నమః
నమో నమః శివాయ) “4”
మ్, తప్పు చేస్తే
బ్రహ్మ తలనే తుంచినావురా
వేడుకుంటె విషాన్నైనా మింగినావురా
(నమో నమః
నమో నమః
నమో నమః శివాయ)
ఆదిపరాశక్తి నిన్ను కోరుకుందిరా
సృష్టిలోన మొదటి ప్రేమ కధే నీదిరా
(నమో నమః
నమో నమః
నమో నమః శివాయ)
రారా శివరాత్రి సుందర…
మా రాత మార్చి ఉద్దరించరా
అనంతమైన నీ ప్రేమలో
రవ్వంత మాకు ఇస్తే
భూమి స్వర్గమౌనురా…
(నమో నమః
నమో నమః
నమో నమః శివాయ) //4//
ఆది ప్రేమిక… నీకు పోలిక
లేదు లేదిక జగాన
భక్త కోటికి… ఉన్న కోరిక
తీర్చుతావయా స్వయానా
ఈశ్వరి కోసం అర్ధనారీశ్వరుడయ్యావు
లోకాన్నే ఏలు పరమేశ్వరుడా…
ఏ లోటూ రానీవు… ఎపుడు తోడుంటావు
మగడంటే నువ్వే మహేశ్వరుడా
ఆది నువ్వే… అంతం నువ్వే
కాపాడే ఆపద్భాంధవుడా……
(నమో నమః
నమో నమః
నమో నమః శివాయ) //4//
శివ శివ శివ
శివ శివ శివ
శివ శివ శివ
శివ శివ శివ
శివ శివ శివ
శివ శివ శివ
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ
శివ శివ శివ
శివ శివ శివ
శివ శివ శివ
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ
శివ శివ శివ
శివ శివ శివ
శివ శివ శివ
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ
శివ శివ శివ
శివ శివ శివ
శివ శివ శివ
నమో నమః
నమో నమః
నమో నమః శివాయా