Neelo Naalo Song Lyrics భువనచంద్ర అందించగా, వివేక్ సాగర్
సంగీత సారధ్యంలో రాజేష్ కృష్ణన్ మరియు అంజనా సౌమ్య పాడిన ఈ పాట ‘స్వాగ్’ చిత్రంలోనిది.
Neelo Naalo Song Credits
SWAG Telugu Movie Release Date – 04 October 2024 | |
Director | Hasith Goli |
Producer | T.G. Vishwa Prasad |
Singers | Rajesh Krishnan & Anjana Sowmya |
Music | Vivek Sagar |
Lyrics | Bhuvana Chandra |
Star Cast | Sree Vishnu, Ritu Varma, Meera Jasmine, Daksha Nagarkar |
Music Label & Source | Tips Telugu |
Neelo Naalo Song Lyrics
నీలో నాలో కదలాడు భావమీరాగం
లోలో ఎదలో వినిపించ సాగే ఓ తాళం
నీలో నాలో… కదలాడు భావమీరాగం
లోలో ఎదలో… వినిపించ సాగే ఓ తాళం
తమకపు తీరాలలో
పెదవుల సయ్యాటలో
తరగని శృంగారమే
తెరిచిన సౌధాలలో
రేపటి కలనే చెలియా కందామా..?
కమ్మని కబురే జతగా విందామా..?
నీలో నాలో కదలాడు భావమీరాగం
లోలో ఎదలో వినిపించ సాగే ఓ తాళం…
కలల జడి నేను… కావేరి నువ్వు
ఓ ప్రణయ తీరం సాకారమే
కువకువల గువ్వ గోరింక లాగా
మనము ఒకటైతే… నవ లోకమే
వేకువై నేనుంటా… నీవెంట ప్రేమ
వెన్నెలై నను చేరి అలరించరావా!
గాలులను ఎదిరించె… కొండవలే నేనుంట
ఒదిగిపో వెచ్చగా
గుండెలో.. (గుండెలో, గుండెలో)
నీలో నాలో కదలాడు భావమీరాగం
లోలో ఎదలో వినిపించ సాగే ఓ తాళం
తనదైన తీరం… పెను దూరమైతే
సుడిలోని నావా సాగేదెలా? ఆ ఆ
వలచి వలపించే ప్రియమైన గీతం
ఎదకు ఎడమైతే నిలిచేదెలా?
వెన్నెలను మింగేసే… మేఘాల మొహం
వేకువను కప్పేసే… మోహాల దాహం
ఉల్కలే ఉప్పెనగా… రాలేటి గగనాన
నవ్వులే పువ్వులై విరియునా
(విరియునా, విరియునా విరియునా)