‘నిను వీడని నేనే’ చిత్రం ద్వారా తనేంటో నిరూపించుకున్న దర్శకుడు కార్తీక్ రాజు మరో మహిళా ప్రాధాన్య చిత్రం ‘నేనే నా..?’ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రెజీనా కథానాయిక. తెలుగు మరియు తమిళ భాషల్లో రూపొందుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ తమిళనాడు పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటుంది.
‘నేనే నా’ సినిమా మొదటి లుక్
‘నేనే నా..?’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా ఈరోజు విడుదలైంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో రెజీనా ముఖానికి
రెండు వైపులా రక్తపు చారలతో రాణిగా దుస్తులు ధరించింది. ఇనుప రేకులతో చేసిన గదిలో నిల్చొని, చుట్టూ పదునైన
మొనలతో ఉన్న ఆ గదిలో ఉన్న రెజీనా పోస్టర్ చూస్తుంటే కచ్చితంగా కథపై ఆసక్తి కలుగుతుంది.
పురాతత్వ శాస్త్రవేత్త పాత్రలో నటి అక్షర గౌడ నటిస్తుండగా వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఆపిల్ ట్రీస్ స్టూడియోస్ పతాకంపై రాజ్ శేఖర్ వర్మ నిర్మిస్తున్న ‘నేనే నా..?’ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వేసవిలో విడుదల చేయనున్నారు ఈ చిత్రాన్ని.
Here is the first look of #NeneNaa
Starring @ReginaCassandra
Directed by @caarthickraju
Produced by #AppleTreeStudios @vennelakishore @samCSMusic @iAksharaGowda @sathishoffl @SureshChandraa
Goodluck to the entire team!👍🏽👍🏽 pic.twitter.com/ujx3enFvwi
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) March 3, 2020
Read Also: నిశ్శబ్దం ట్రైలర్ మార్చి 6న