నిశ్శబ్దం ట్రైలర్ మార్చి 6న నాని చేతుల మీదుగా విడుదల

నిశ్శబ్దం ట్రైలర్ మార్చి 6న

అనుష్క ప్రధాన పాత్రలో పలు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘నిశ్శబ్దం’. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ద్వారా ప్రేక్షకుల్లో
రేకెత్తించింది. మాటలు రాణి యువతిగా అనుష్క ఈ చిత్రంలో నటిస్తుండగా మాధవన్, హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్సెన్,
అంజలి, అర్జున్ రెడ్డి నటి శాలిని పాండే మొదలగువారు ప్రధానపాత్రల్లో కనిపించనున్నారు.

నిశ్శబ్దం ట్రైలర్ మార్చి 6న

‘నిశ్శబ్దం’ చిత్ర ట్రైలర్ ను మార్చి 6న నాచురల్ స్టార్ నాని చేతులు మీదుగా విడుదల చేయడానికి చిత్రబృందం నిర్ణయించింది.
చిత్ర షూటింగ్ మొత్తం సీటెల్ లోనే చిత్రీకరిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌ల సంయుక్త
సమర్పణలో కోన వెంకట్, టిజి విశ్వ కలిసి నిర్మిస్తున్న ‘నిశ్శబ్దం’ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

‘నిశ్శబ్దం’ చిత్ర విడుదల తేదీ

వేసవి కానుకగా ఏప్రిల్ 2న తెలుగు, తమిళ్, హిందీ తో పాటు ఇతర భాషల్లో కూడా విడుదలవుతుంది.