ఏపీ లో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు లేవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 6వ తరగతి నుండి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వార్షిక పరీక్షలు రద్దు చేసింది. కరోనా వైరస్ నివారణ నేపథ్యంలో ఇక తరగతులు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది సర్కారు.
ఏపీ లో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు లేవు
ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారికంగా మీడియాకు తెలిపారు. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ మరియు వైరస్ వ్యాప్తి దృష్ట్యా పరీక్షలు నిర్వహించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని భావించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్యాన్ని తీసుకున్నట్టు మంత్రి చెప్పారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రైవేట్ స్కూళ్లకు కూడా వర్తిస్తుంది. అయితే 6 నుండి 9 తరగతుల వారికి వార్షిక పరీక్షలు లేనప్పటికీ వారి హాజరు శాతాన్ని పరిగణనలోకి తీసుకొని తరువాతి తరగతులకు ప్రమోషన్ ఇస్తారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది జగన్ సర్కార్.