జొమాటో స్విగ్గీ లకు తెలంగాణాలో మే 7 వరకు అనుమతి లేదు. ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ విషయమై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు.
వైరస్ వ్యాప్తికి ఆన్ లైన్ లో ఫుడ్ డెలివరీ కూడా కారణం అవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మధ్య దేశ రాజధాని ఢిల్లీలో పిజ్జా డెలివరీ చేసే వ్యక్తి ద్వారా దాదాపు 61 మందికి కరోనా సోకడంతో, మన దగ్గర ఆలాంటి పరిస్థితి రావద్దని జొమాటో, స్విగ్గీ తో పాటు మరేఇతర ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు రేపటి నుండి అంటే 20 ఏప్రిల్ 2020 నుండి తెలంగాణాలో బ్యాన్ చేస్తున్నట్టు కేబినెట్ సమావేశం అనంతరం సీఎం మీడియా సమావేశంలో చెప్పారు.
జొమాటో స్విగ్గీ లకు తెలంగాణాలో మే 7 వరకు అనుమతి లేదు.
జొమాటో, స్విగ్గీ లు బంజేసి పప్పు తిందాం. అంతే కానీ ప్రాణాలను రిస్కులో పెట్టుకోకండి అని ప్రజలకు హితవు పలికారు. వీటిని బ్యాన్ చేయడం ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేదు, వీటి ద్వారా రాష్ట్రానికి వచ్చే సర్వీస్ టాక్స్ పోతుంది, వ్యాధి ఇప్పటికీసమానస్థాయిలో ఉన్నందున ఈ నిర్ణయం తప్పదని ముఖ్యమంత్రి కెసీఆర్ చెప్పుకొచ్చారు.
Also Read: మే 7 వరకు తెలంగాణాలో లాక్‌డౌన్