Home » తాజా వార్తలు » మే 7 వరకు తెలంగాణాలో లాక్‌డౌన్‌ – కేంద్ర సడలింపు తెలంగాణాలో వర్తింపు లేదు

మే 7 వరకు తెలంగాణాలో లాక్‌డౌన్‌ – కేంద్ర సడలింపు తెలంగాణాలో వర్తింపు లేదు

by Devender

మే 7 వరకు తెలంగాణాలో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. ఇది వరకు తెలంగాణా రాష్ట్రంలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్‌ ఉంటుందని చెప్పిన ప్రభుత్వం అలాగే కేంద్రం మే 3 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని చెప్పగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మే 7 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని తెలిపారు.

మే 7 వరకు తెలంగాణాలో లాక్‌డౌన్‌

అయితే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 20 నుండి కొన్నిటికి సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం మీద కెసిఆర్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఇందుకు సంబంధించి ఏలాంటి సడలింఫులు ఉండవని తేల్చారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలకు ఇచ్చిందని. వైరస్ తీవ్రత ఉన్న రాష్ట్రాలు తమ నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెప్పింది. అందుకు తగ్గట్టు రాష్ట్రంలో సడలింపులకు ఇవ్వకూడదని మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకున్నట్టు సీఎం చెప్పారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి కఠిన నిర్ణయాలు తప్పవని, అందుకు అందరూ సహకరించాలని ప్రజలను కోరారు సీఎం కెసిఆర్. తదుపరి తీసుకునే చర్యల మీద మే 5న తిరిగి కాబినెట్ సమావేశం కానుంది అని చెప్పారు.

ఈ-కామర్స్ కంపెనీలు నిత్యావసరాలే సరఫరా చేయాలి

You may also like

Comments are closed.