జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రం త్రివిక్రమ్ తో, అధికార ప్రకటన

జూనియర్ ఎన్టీఆర్ రెండోసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో జతకడుతున్నాడు. ఈ విషయానికి సంబంధించి ఒక పోస్టర్ ద్వారా అధికారిక ప్రకటన ఈరోజు (19/02/2020) వెలువడింది. ఎన్టీఆర్ కు ఇది 30వ చిత్రం. మే 30న
ప్రారంభవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో వేసవి కానుకగా తెరపైకి వస్తుంది. ఎస్ రాధాకృష్ణ (హారికా మరియు
హాసిన్ క్రియేషన్స్) మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ (కళ్యాణ్ రామ్) లు సంయుక్తంగా #ఎన్టీఆర్30 చిత్రాన్ని నిర్మిస్తారు.

జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రం

బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్
శ్రీనివాస్ కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ ద్వారా సరికొత్త రికార్డులు సృష్టించడానికి సన్నద్ధమవుతున్నారు.

‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో సీరియస్ మరియు సందేశాన్నిచ్చే పాత్రలో ఎన్టీఆర్ ను చూపించిన త్రివిక్రమ్ రాబోయే
సినిమాలో ఏలాంటి పాత్రలో తారక్ ను చూపిస్తాడని అభిమానులు ఆసక్తి రేకెత్తిస్తుంది.

అయితే సినిమా టైటిల్ ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ పెడుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇది నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉండగా ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు తారక్. కొమరం భీం పాత్రలో నటిస్తున్న తారక్ సరసన ఒలీవియా మోరిస్ నటిస్తుంది.

Also Read: Nani V Movie Teaser