NTR Birthday Gift to Ram Charan
మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా #RRR చిత్రం బృందం కానుక ఇవ్వనుంది. రేపు చరణ్ ఫస్ట్ లుక్ వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రకు సంబంధించి సర్ ప్రైజింగ్ వీడియో వస్తుంది.
Breaking: ఎవ్వరూ తగ్గడం లేదు కదా…! ఈరోజు 10గంటలకు ఇస్తా అన్న సర్ ప్రైజింగ్ వీడియో జక్కన్నకు నిన్న రాత్రే పంపించా… చిన్న డిలే.. అని ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా చరణ్ కు చెప్పగా… ఏంటి ..? అతనికి పంపించావా ?.. అసలు ఉంటుందా ఈరోజు..? అని ప్రశ్నించాడు చెర్రీ… దీనికి రిప్లై ఇస్తూ తారక్.. అవును రాజమౌళి గారు చెప్పారు, సాయంత్రం 4 గంటలకు అని.
Ram Charan RRR Movie Gift at 4PM Today.
ఈ విషయాన్నీ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు సర్ ప్రైజ్ రానుంది. లాక్ డౌన్ దృష్ట్యా బయటికి రాలేక ఇంట్లోనే ఉంటున్న కారణంగా నీ పుట్టినరోజును డిజిటల్ గా నిర్వహించడానికి సిద్ధమయ్యాము, నన్ను నమ్ము.. ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ నీకోసం అని తారక్ ట్విట్టర్ ద్వారా చరణ్ కు చెప్పారు.
ఈ ట్వీట్ కు స్పందించిన రామ్ చరణ్. సరైన సమయానికి ట్విట్టర్ లో జాయిన్ అవడం మంచిదయినట్టుంది. లేకుంటే సూపర్ సర్ ప్రైజ్ మిస్సయ్యేవాడిని.. రేపటి కోసం ఎదురు చూస్తున్నాను అని బదులిచ్చారు.
ఉగాది రోజున సినిమా పేరును రివీల్ చేసిన బృందం ఒక్కరోజు గ్యాప్ తీసుకొని మరో సర్ ప్రైజ్ ఇవ్వడం అభిమానులకు ట్రీట్.
NTR Birthday Gift to Ram Charan
Bro @AlwaysRamCharan, I wish I could’ve celebrated your birthday under better circumstances. But since we’re under a lockdown & because staying home is important,I’m giving you a digital surprise at 10am tomorrow. Trust me,this is a bang you won’t ever forget #BheemforRamaraju pic.twitter.com/Xq13wBBXOY
— Jr NTR (@tarak9999) March 26, 2020
Also Read: RRR Movie Title Launched