Home » తాజా వార్తలు » Roudram Ranam Rudhiram RRR Movie Logo Out – RRR Motion Poster

Roudram Ranam Rudhiram RRR Movie Logo Out – RRR Motion Poster

by Devender

Roudram Ranam Rudhiram RRR Movie Logo. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సినీ అభిమానులకు ఎస్ ఎస్ రాజమౌళి ఉగాది శార్వారి నామ సంవత్సర పర్వదినాన కానుకఇచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమా మోషన్ పోస్టర్ ఈరోజు విడుదలైంది.

Roudram Ranam Rudhiram RRR Movie Logo

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న RRR సినిమా టైటిల్ ను ఎట్టకేలకు ఈరోజు విడుదల చేసింది చిత్ర బృందం. అగ్ర కథానాయకులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన తారాగణంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ‘రౌద్రం రణం రుధిరం’ అనే పేరు ఖరారు చేశారు.

1 నిమిషం 15 సెకండ్ల నిడివి గల మోషన్ పోస్టర్ లో నిప్పురవ్వలు ఎగసి పడుతూ, చుట్టూ అగ్గి రగులుతుండగా పరిగెడుతున్న అగ్ని స్వరూపంగా రామ్ చరణ్ ను మరియు ఉరుముతున్న మేఘాలు, మెరుస్తున్న మెరుపులు, నీటి బిందువులను చీల్చుకుంటూ అదే రీతిలో పరిగెడుతున్న జల స్వరూపంగా ఎన్టీఆర్ ను రాజమౌళి తనదైన శైలిలో అద్భుతంగా చూపించారు.

రౌద్రం రణం రుధిరం

రౌద్రం కు గుర్తుగా చరణ్ ను, రుధిరం కు గుర్తుగా ఎన్టీఆర్ ను వీరిద్దరి మధ్య ఉన్న R కు గుర్తుగా రణం, ఇందులో ఇద్దరూ ఒకరికి ఒకరు తోడుగా రణం చేస్తున్నట్టు 1920లో కథ జరిగినట్టు చూపించారు రాజమౌళి.

300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘రౌద్రం రణం రుధిరం’ చిత్రంలో మొదటిసారి రామ్ చరణ్-ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. కొమరం భీం గా కనిపిస్తున్న ఎన్టీఆర్ కు సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ మరియు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న చరణ్ కు జోడిగా బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తున్నారు.

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. సంక్రాంతి కానుకగా ‘రౌద్రం రణం రుధిరం’ సినిమా జనవరి 8, 2021న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Watch RRR Movie Motion Poster

Read: Movie News

You may also like

Leave a Comment