O Pilaga Venkatesh Song Lyrics penned & sung by Prabha, and music composed by Venkat Azmeera. Telangana latest folk song.
O Pilaga Venkatesh Song Credits
Singer: Prabha
Music: Venkat Azmeera
Lyrics: Prabha
Star Cast: Pooja Nageshwar, Rowdy Harish
Producer: Balu Paloji
Song Label: BHAVYA Tunes
O Pilaga Venkatesh Song Lyrics
ఓ పిలగ ఎంకటేసు
(ఎంకటేసు, ఎంకటేసు)
ఓ పిలగ ఎంకటేషు
సితురాల మనసు నాది
సిన్నగ బోతుంటవో… సూడక బోతుంటవో
ఇంట్ల సిన్నదాన్ని నేను
సితురాల దాన్నిరో… సిన్నెల సూబిస్తవో ||2||
ఓ పిలగ ఎంకటేషు
సూడక బోతుంటవో… కానక బోతుంటవో
నా పిలగ ఎంకటేషు
సూడక బోతుంటవో… కానక బోతుంటవో
ఆ, అందాల గుమ్మ నేను
ఆగక పొతున్నవో… అలుసుగ జూస్తున్నవ్
నీ సొమ్మేమన్నడిగిన్న
సోకుల వడుతున్నవో… సొమ్మసిల్లి పోతవో
నీయంట తిరుగుతున్ననని అలుసైపోతున్నన
నువ్వే గావాలనొస్తే… నన్నే గాదంటావా
ఓ పిలగ… ఓ పిలగ
యహె ఓ పిలగ ఎంకటేషు
సూడక బోతుంటవో… కానక బోతుంటవో
నా పిలగ ఎంకటేషు
సూడక బోతుంటవో… కానక బోతుంటవో
ఒయ్, కండ్లకు కాటుక వెడితే
కన్యాకుమారిని నా కండ్లు సూడబోతివి
బొమ్మల నడుమ బొట్టు వెడితే
పల్లెతనంగుంటనో నిన్నే ఇడిసి పెట్టను
అవ్వయ్యకు సిన్నదాన్ని సివంగీ పిల్లను
సిన్నసూపు జూస్తే నిన్ను నేను ఇడిసిపెట్టను
ఓ పిలగ… అరెరే ఓ పిలగ
అమ్మో ఓ పిలగ ఎంకటేషు
సూడక బోతుంటవో… కానక బోతుంటవో
నా పిలగ ఎంకటేషు
సూడక బోతుంటవో… కానక బోతుంటవో
యహె, మనవూరిలో నన్ను మించే
అందమెవరికున్నదో… అందగత్తె నేనురో
ఆస్తి పాస్తులెన్ని ఉన్న
నిన్నే గోరుకుంటిరో… నీతోనే వస్తనంటిరో
నువ్వే నా పాణమంటి, నీతోనే బతుకంటి
నిన్నిడిసి ఉండలేను… నీ ఎంటే వస్తరో
(అహ) నీ ఎంటే వస్తరో
ఓ పిలగ ఎంకటేషు
ఓ పిలగ ఎంకటేషు
ఓ పిలగ ఎంకటేషు…
తానానే నన్నానే, తానానే నన్నానే
తానానే నన్నానే…
తానానే నన్నానే, తానానే నన్నానే
తానానే నన్నానే…