ఊరంతా అనుకుంటున్నారుకి బెస్ట్ విషెస్ చెప్పిన‌ మ‌హేష్ బాబు

‘ఊరంతా అనుకుంటున్నారు’ చిత్రానికి సూప‌ర్ స్టార్ మహేష్ బాబు బెస్ట్ విషెస్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా చిత్ర ట్రైలర్ ను షేర్
చేస్తూ ట్రైలర్ చాలా కొత్తగా ఉందని, ప్ర‌తీ బిట్ చాలా ఎంజాయ్ చేశాను, న‌వీన్ విజ‌య కృష్ణ‌కి మరియు చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపారు.

న‌రేష్ త‌న‌యుడు న‌వీన్,  శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, సోఫియా సింగ్ ప్ర‌ధాన తారాగణంతో అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’.

రోవస్కైర్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, యుఐ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్స్‌ పతాకంపై శ్రీహరి మంగళంపల్లి, ఎ.పద్మనాభరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి బాలాజీ సనాల దర్శకత్వం వహించారు.

న‌వీన్ విజ‌య కృష్ణ‌ నటించిన ‘నందిని నర్శింగ్ హోమ్’ సినిమా తరువాత విడుదల అవుతున్న రెండో చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. కె. ఎం. రాధాకృష్ణ సంగీతాన్ని అందించారు.