Paala Pittalle Song Lyrics from the Telugu movie ‘Sharathulu Varthisthai!‘.
Paala Pittale Song Credits
Movie | Sharathulu Varthisthai! |
Director | Kumara Swamy (Akshara) |
Singers | Haricharan, Bhargavi Pillai |
Musician | Arun Chiluveru |
Lyricist | Mallegoda Ganga Prasad |
Star Cast | Chaitanya Rao Madadi, Bhoomi Shetty |
Music Label & Source |
Paala Pittalle Song Lyrics in English
Paala Pittalle Preme Vaale
Poola Settalle Ooge
Eedu Rangullo Singidochhe
Rendu Gundello Ninde
O Gadiyalo
Seruku Sekkarai Karigele
Ee Chelimilo
Theepi Chilakale Kalisele
Gaalilo Pittalai Gaalikoogaale
Yetilo Sepalai Sindhulaadaale
Mabbu Sindhe Sinuku Nuvve
Matti Kindha Ginja Nene
Maatalo Saayamai Thodu Nilavaale
Thetaga Chelimilo Premalooraale
Patta Golusulaaga Ninne Pettukonaa
Suttumuttu Naaku Thodu Needagaa
Pattu Seerelaaga Suttu Suttukonaa
Gundemaadha Vaalipovaa Premagaa
Thangedu Puvvulai Sindhulaadaale
Gongadi Allikai Muddhugundaale
Kottha Chinthakomma Nuvve
Pachhipulusu Buvva Nene
Cheruvulu Matthadai Dhunkulaadaale
Vaagulo isakalaa Kalisi Nadavaale
Pasupu Gandhamalle Ninne Poosukonaa
Pandagalle Nuvve Naatho Undavaa
Butta Kammalalle Ninne Pettukonaa
Guttu Muttu Chevilo Naake Cheppavaa
Watch పాలపిట్టల్లే Video
Paala Pittalle Song Lyrics in Telugu
పాలపిట్టల్లే ప్రేమే వాలే
పూల సెట్టల్లే ఊగే
ఈడు రంగుల్లో సింగిడొచ్చే
రెండు గుండెల్లో నిండే
ఓ గడియలో
సెరుకు సెక్కరై కరిగెలే
ఈ చెలిమిలో
తీపి చిలకలే కలిసెలే
గాలిలో పిట్టలై గాలికూగాలే
ఏటిలో సేపలై సిందులాడాలే
మబ్బు సిందే సినుకు నువ్వే
మట్టి కింద గింజ నేనే
మాటలో సాయమై తోడు నిలవాలే
తేటగా చెలిమిలో ప్రేమలూరాలే
పట్టగొలుసులాగా నిన్నే పెట్టుకోనా
సుట్టుముట్టు నాకు తోడు నీడగా
పట్టు సీరెలాగ సుట్టు సుట్టుకోనా
గుండెమీద వాలిపోవా ప్రేమగా
తంగెడు పువ్వులై సిందులాడాలే
గొంగడి అల్లికై ముద్దుగుండాలే
కొత్త చింతకొమ్మ నువ్వే
పచ్చిపులుసు బువ్వ నేనే
చెరువులు మత్తడై దుంకులాడాలే
వాగులో ఇసకలా కలిసి నడవాలే
పసుపు గంధమల్లే నిన్నే పూసుకోనా
పండగల్లే నువ్వే నాతో ఉండవా
బుట్టా కమ్మలల్లే నిన్నే పెట్టుకోనా
గుట్టుముట్టు చెవిలో నాకే చెప్పవా
పాలపిట్టల్లే ప్రేమే వాలే
పూల సెట్టల్లే ఊగే
ఈడు రంగుల్లో సింగిడొచ్చే
రెండు గుండెల్లో నిండే
ఓ గడియలో
సెరుకు సెక్కరై కరిగెలే
ఈ చెలిమిలో
తీపి చిలకలే కలిసెలే