Pannendu Gunjala Song Lyrics

0
Pannendu Gunjala Song Lyrics
Pic Credit: Icon Music South (YouTube)

Pannendu Gunjala Song Lyrics from Telugu cinema Sharathulu Varthisthai!.

Pannendu Gunjala Song Credits

Movie Sharathulu Varthisthai
Director Kumara Swamy (Akshara)
Singers Shankar Babu, Telu Vijaya, Vollala Vani, Mogulla Shankaramma
Musician Suresh Bobbili
Lyricist Peddinti Ashok Kumar
Star Cast Chaitanya Rao Madadi, Bhoomi Shetty
Music Label & Source

Pannendu Gunjala Song Lyrics in English

Pannendu Gunjala Pandiri Kindhaa
Pannendu Gunjala Pandiri Kindhaa
Pachhani Panditla Muthyaala Polu
Pachhani Panditla Muthyaala Polu

Muthyaala Polu Meena Gajjellaa Kaani
Muthyaala Polu Meena Gajjellaa Kaani

Watch పన్నెండు గుంజాల Video

Pannendu Gunjala Song Lyrics in Telugu

పన్నెండు గుంజాల పందిర్ల కిందా
పన్నెండు గుంజాల పందిర్ల కిందా
పచ్చని పందిట్ల ముత్యాల పోలు
పచ్చని పందిట్ల ముత్యాల పోలు
ముత్యాల పోలు మీన గజ్జెల్లా కాని
ముత్యాల పోలు మీన గజ్జెల్లా కాని
గజ్జెల్లా కాని మీద పెండ్లి పీటలు
పెండ్లి పీటల మీన ఎవ్వరు ఉన్నారు
పెండ్లి పీటల మీన ఎవ్వరు ఉన్నారు
సీత శ్రీరాముడు పెళ్ళివారైరి
సీత శ్రీరాముడు పెళ్ళివారైరి

ఆ రెండు గుండెలొకటి జేసే
పెండ్లంటే పండుగే
ఇల్లంతా సందడే
సున్నాలేసి జాజులు వూసి
పాలపొరుక తీసుడే
పచ్చని పందిరేసుడే

కుండలు దీసి ముగ్గులు గీసి
ఐరేండ్లను జేసుడే
ఒడి బియ్యం బోసుడే
సన్నాబియ్యం సాలువోసి
జోడు పీటలేసుడే
మైలా పోలు దీసుడే
గంధం రాసి హారతి దీసి
చెక్కర కుడుకలు పోసుడే
సెల్ఫీలను దీసుడే

ఆడి పాడే అల్లరి పిల్లను
పెళ్లి పిల్లను జేసుడే
కొసరు దిష్టి తీసుడే

కాళ్ళకు పారాణి బూసి
పసుపు రాసి నీళ్ళు పోసి
అల్లుడే దేవుడని కాళ్ళు కడిగినా
పాలు తేనె కలిపి పోసి
బంధానికి తీపి పోసి
మెట్టినింటి మేలు కోరి పోలు వోసినా

నెత్తికి జిలకర బెల్లం బెట్టిన
పసుపుతాడుకు పుస్తెలు గట్టిన
ఇద్దరినొక్కటి జేసే
కొంగూ బంధమే పెండ్లీ
ఏమిటో నువ్వు తెలువకున్నా
ఎన్నడు నిన్ను కలువకున్నా
బతుకుల సగభాగం ఇచ్చే
ప్రేమ బంధమే పెండ్లీ

ఏడవకు ఏడవకే నా ముద్దు బిడ్డా
నవ్వుతు దాటాలే పుట్టింటి గడ్డా
ఆడపిల్లంటే పుట్టింటి సుట్టం
బతుకు మార్చెను ఈ పెళ్లి ఘట్టం
నీ ఇల్లు నీ బతుకు ఈడ గాదమ్మా
రాత రాసిండు ఆడ అని ఆ బ్రహ్మా

పెనిమిటే నీకు తోడొక్క నీడా
నచ్చ తిరుగాలే ఊరొక్క వాడా
ఇంటి దీపాన్ని నీకిస్తినయ్యా
కంట కన్నీరు రానియ్యకయ్యా

ఏడవకు ఏడవకే నా ముద్దు బిడ్డా
నవ్వుతు దాటాలే పుట్టింటి గడ్డా

ఏడవకు ఏడవకు నా ముద్దు తల్లీ
ఎళ్లి బతుకాలె నిండు నూరేళ్లూ

All Lyrics from Sharathulu Varthisthaayi Movie

Dev P
I am Dev P, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.