Home » సినిమా » Prabhas Next Movie With Nag Ashwin – Officially Confirmed ప్రభాస్ కొత్త మూవీ ప్రకటన

Prabhas Next Movie With Nag Ashwin – Officially Confirmed ప్రభాస్ కొత్త మూవీ ప్రకటన

Prabhas Next Movie With Nag Ashwin – Officially Confirmed ప్రభాస్ కొత్త మూవీ ప్రకటన.

ప్రభాస్ అభిమానులకు అతి పెద్ద గిఫ్ట్ వచ్చింది. రెబెల్ స్టార్ తన తదుపరి చిత్రాన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్నాడు. 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న ప్రతిష్టాత్మక వైజ‌యంతి మూవీస్ అధికారికంగా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వీడియో ద్వారా తెలిపింది.

investment

Prabhas Next Movie With Nag Ashwin

‘ప్రభాస్ తో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించడానికి గర్వపడుతున్నాం’ అని ట్విట్టర్ ద్వారా పంచుకుంది. కొన్ని రోజుల క్రితం నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా నిర్మిచబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రం ప్రభాస్ తో అని ఇప్పుడు స్పష్టం చేసింది.

ప్రస్తుతం రెబెల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్
జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే నటిస్తుంది.అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ చిత్రం పేరు ‘జాన్’ అని ప్రచారంలో ఉంది.

ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి చిత్రం విమర్శకుల ప్రశంశలు అందుకోవడమే కాకుండా ఈ చిత్రంలో ముఖ్య
పాత్రలో నటించిన కీర్తి సురేష్ కు జాతీయ అవార్డు కూడా తెచ్చిపెట్టింది.

చివ‌రిగా వైజ‌యంతి మూవీస్ పతాకంపై వచ్చిన చిత్రం మహర్షి.

1 thought on “Prabhas Next Movie With Nag Ashwin – Officially Confirmed ప్రభాస్ కొత్త మూవీ ప్రకటన”

  1. Pingback: ఓ పిట్ట కథ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ - మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ - 10 To 5

Comments are closed.

Scroll to Top