‘రాగల 24 గంటల్లో’ సినిమా టీజర్ ను ఈరోజు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేశారు. సత్యదేవ్
కథానాయకుడిగా ఇషా రెబ్బా కథానాయికగా శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ ‘రాగల 24 గంటల్లో’.
టీజర్ చాలా బాగుంది, చిత్ర టైటిల్ తో పాటు రఘు కుంచె సంగీతం ఆకట్టుకునేల ఉన్నాయని, సినిమా చూసి ఖచ్చితంగా ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారు అని ఈ సందర్భంగా త్రివిక్రమ్ అన్నారు.
కార్తికేయ సెల్యూలాయిడ్స్ సమర్పణలో శ్రీ నవ్‌హాస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ కానూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీరామ్, గణేశ్ వెంకట్రామన్, కృష్ణ భగవాన్ ముఖ్య పాత్రల్లో నటించారు.
దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘రాగల 24 గంటల్లో’ అక్టోబరు 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.