‘బిగ్ బాస్ 3 తెలుగు’ విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ బెంజ్ కారుకు ఓనర్ అయ్యాడు. బంజార హిల్స్ బెంజ్ షోరూమ్
నుండి వైట్ మెర్సిడెస్ బెంజ్ కారును కొన్నాడు. రాహుల్ కారు కొనడం ఏమో కాని ఈ వార్తకు సంబందించి యూట్యూబ్ లో వీడియోల మీద వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.
బిగ్ బాస్ 3 తెలుగులో టైటిల్ గెలిస్తే తల్లిదండ్రులకు సొంతంగా ఒక ఇల్లు కొనిస్తాను అని చెప్పిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ విజేతగా రాహుల్ 50 లక్షలు గెలుచుకున్నాడు.
బిగ్ బాస్ ఇంటి నుండి బయటికి రావడమే ఆలస్యం అవకాశాలు బాగానే వస్తున్నాయి. ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంలో ఓ
మై గాడ్ డాడి పాట మరియు ‘ఎంత మంచివాడవురా’ చిత్రంలో జాతరో జాతరో పాట పాడాడు. ఈ రెండు చిత్రాలు సంక్రాంతికి
ప్రేక్షకులను అలరించనున్నాయి.
అలాగే కృష్ణవంశి దర్శకత్వంలొ వస్తున్న ‘రంగ మార్తాండ’ చిత్రంలో నటిస్తుండడం విశేషం. త్వరలో హీరోగా కూడా చేస్తున్నట్టు
టాలీవుడ్ లో ఒక వార్త చెక్కర్లు కొడుతుంది. అయితే అది నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.