FROM THE 10TO5 LYRICS ARCHIVE

బెంజ్ కారు కొన్న రాహుల్ సిప్లిగంజ్ – యూట్యూబ్ లో తెగ చెక్కర్లు కొడుతుంది

Published: January 5, 2020

Category: తాజా వార్తలు, సినిమా

బెంజ్ కారు కొన్న రాహుల్ సిప్లిగంజ్

Song Lyrics

‘బిగ్ బాస్ 3 తెలుగు’ విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ బెంజ్ కారుకు ఓనర్ అయ్యాడు. బంజార హిల్స్ బెంజ్ షోరూమ్
నుండి వైట్ మెర్సిడెస్ బెంజ్ కారును కొన్నాడు. రాహుల్ కారు కొనడం ఏమో కాని ఈ వార్తకు సంబందించి యూట్యూబ్ లో వీడియోల మీద వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.

బిగ్ బాస్ 3 తెలుగులో టైటిల్ గెలిస్తే తల్లిదండ్రులకు సొంతంగా ఒక ఇల్లు కొనిస్తాను అని చెప్పిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ విజేతగా రాహుల్ 50 లక్షలు గెలుచుకున్నాడు.

బిగ్ బాస్ ఇంటి నుండి బయటికి రావడమే ఆలస్యం అవకాశాలు బాగానే వస్తున్నాయి. ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంలో ఓ
మై గాడ్ డాడి పాట మరియు ‘ఎంత మంచివాడవురా’ చిత్రంలో జాతరో జాతరో పాట పాడాడు. ఈ రెండు చిత్రాలు సంక్రాంతికి
ప్రేక్షకులను అలరించనున్నాయి.

అలాగే కృష్ణవంశి దర్శకత్వంలొ వస్తున్న ‘రంగ మార్తాండ’ చిత్రంలో నటిస్తుండడం విశేషం. త్వరలో హీరోగా కూడా చేస్తున్నట్టు
టాలీవుడ్ లో ఒక వార్త చెక్కర్లు కొడుతుంది. అయితే అది నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

 

 

💬 WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.