Ram RED Movie Official Teaser Out రాపో ఒక్కడు కాదు ఇద్దరు

Ram RED Movie Official Teaser

Ram RED Movie Official Teaser Out రామ్ రెడ్ టీజర్ వచ్చేసింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ కం లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘రెడ్’. ఈ చిత్ర టీజర్ ను చిత్ర బృందం ఈరోజు (28.02.2020) సాయంత్రం విడుదల చేసింది.

Ram RED Movie Official Teaser

ఇస్మార్ట్ శంకర్ చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రామ్ పోతినేని రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు.
ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ఒక పాత్రలో గుబురు గడ్డం డీగ్లామర్ లుక్ మరొక పాత్రలో
సాఫ్ట్ బోయ్ లా కనిపిస్తాడు రామ్.

నిజజీవితంలో జరిగిన ఘటనను ఆధారంగా తీసుకుని దర్శకుడు అందుకు తగ్గ కథ రాసుకుని దానిని తెరపై చూపించిన విధానం
కట్టిపడేసేలా ఉందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. సిద్ధార్థ్ మరియు ఆదిత్య అనే రెండు పాత్రల్లో కనిపించే రామ్, ఇంతకీ ఎవరు క్రిమినల్ అనే విషయం తెలియకుండా దర్శకుడు టీజర్ తీర్చిదిద్దాడు.

‘క్రైమ్ హిస్టరీలో ఇలాంటి కేసు చూడడం ఇదే ఫస్ట్ టైమ్’ అనే డైలాగ్ తో మొదలైన టీజర్ చివరి వరకు ఆసక్తి రేకెత్తిస్తుంది. నివేత
పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుంది. నివేత పేతురాజు, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ లు రామ్ కు జోడిగా నటిస్తున్నారు.

నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాల తరవాత కిషోర్ తిరుమల మరియు రామ్ కాంబినేషన్ లో వస్తున్నా మూడవ చిత్రం
రెడ్. స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రెడ్ చిత్రం ఏప్రిల్ 9, 2020న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Nani 27th Movie Title Revealed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *