Home » Saripodhaa Sanivaaram » Sa Ri Ma Pa Song Lyrics – సరిపోదా శనివారం

Sa Ri Ma Pa Song Lyrics – సరిపోదా శనివారం

by Devender

Sa Ri Ma Pa Song Lyrics కృష్ణకాంత్ అందించగా, జేక్స్ బిజోయ్ 
 సంగీతం సమకూర్చగా, కార్తీక్ పాడిన ఈ పాట ‘సరిపోదా శనివారం’చిత్రంలోనిది.

Sa Ri Ma Pa Song Lyrics Credits

Saripodhaa Sanivaaram Released Date – 29 August 2024
DirectorVivek Athreya
ProducersDVV Danayya, Kalyan Dasari
SingersKarthik
MusicJakes Bejoy
LyricsSanare
Star CastNani, Priyanka Arul Mohan
Music Label & CopyrightSony Music South

Sa Ri Ma Pa Song Lyrics

నగవే లేని పెదవుల్లోన
ఒక నీ పేరే మెదిలెనే
తగువే లేని మగతల్లోన
మనసే నిన్ను తలచెనే

అనుకుందే జరిగిందా
దారేదో దొరికిందా
వద్దందే వచ్చిందేమో
చిత్రంగా కాదనగలమా

(స రి మ ప మా… స రి మ ప మా)

చిరుగాలి వీచినా… వెతికేను చూపులే
తను ముందు నిలిచినా… సోదాలు ఆపవే
కలవాలి అంటూ నిన్నే పాదాలే సాగె
తమ వేగం పెంచాసాయి కాలాలే చూడే

అరరె అరరె కలలానే ఉన్నా, (ఉహు ఊహు ఊ)
కనులే నిజమే చెబుతూనే ఉంటాయేంటో
నీతో నేనుంటే, ఏ ఏ ఏ…

స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స
స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స

అనుకుందే జరిగిందా
దారేదో దొరికిందా…
వద్దందే వచ్చిందేమో
చిత్రంగా కాదనగలమా…?

జరగని కలకన్నారు
తెగ వెతుకుతు ఉన్నారు
తెలియక చేరారు… మీరో తీరమే
కాలం కలిసొచ్చే… బంధం దొరికిందే
నీలా తిరిగిందే… నీ ముందే

తడి మేఘంలా సూర్యున్ని దాచావు నువ్వే
ఆ తాపాలే ఆపేసే… నీ చిన్ని నవ్వే
చూపే కొంచెం సోకితేనే… మంచే ముంచెనే
రాసే లెక్కే దారే తప్పే రాతే నీతో మార్చి రాసావే

చలాకి వీరుడులే
చెలి చెంతింక చేరెనులే
చిన్నారి ఈ చిలకే
చెంగు చెంగంటూ చెయ్ కలిపే

(గ ప గ పా గ ప గ పా, ఆ ఆ ఆ
గ ప గ పా గ ప గ పా)…

కలవాలి అంటూ నిన్నే పాదాలే సాగె
తమ వేగం పెంచాసాయి కాలాలే చూడే

అరరె అరరె కలలానే ఉన్నా, (ఉహు ఊహు ఊ)
కనులే నిజమే చెబుతూనే ఉంటాయేంటో
నీతో నేనుంటే, ఏ ఏ ఏ…

స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స
స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స

అనుకుందే జరిగిందా
దారేదో దొరికిందా…
వద్దందే వచ్చిందేమో
చిత్రంగా కాదనగలమా…?

స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స
స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స

Watch స రి మ ప Video Song

You may also like

Leave a Comment