Sai Pallavi Birthday Posters – విరాట పర్వం, లవ్ స్టోరీ పోస్టర్లు విడుదల

Sai Pallavi Birthday Posters

Sai Pallavi Birthday Posters. సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా ఆమె తాజాగా నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ మరియు ‘విరాట పర్వం’ చిత్రాల స్పెషల్ పోస్టర్లు విడుదల చేశాయి చిత్ర బృందాలు ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ.

నక్సలైట్‌గా సాయిపల్లవి..?

ముఖ్యంగా రానా కు జోడిగా వేణు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న ‘విరాట పర్వం’ చిత్రంలోని సాయి పల్లవి పోస్టర్ చూస్తుంటే ఆకట్టుకుంటుంది. అమరవీరుల స్థూపం దగ్గర గద్దె మీద కూర్చొని ఎవరికోసం ఎదురు చూస్తున్నట్టు ఉంది. ఒక చేతిలో పెన్ను పక్కన ఒక పాత బ్యాగు, తన ఒడిలో ఒక పుస్తకం పట్టుకొని బ్యాక్ గ్రౌండ్ కలర్ కు సరిపోయేలా పుస్తకం, బ్యాగు మరియు తాను వేసుకున్న డ్రెస్సు ఉన్నాయి.

ఇంతకీ బ్యాకులో విప్లవ సాహిత్యాలా, తన దగ్గర ఉన్న పుస్తకం కూడా అదేనా, ఆమె నిజంగానే నక్సలైట్‌గా నటిస్తుందా లేక జర్నలిస్టు పాత్రలో కనిపిస్తుందా తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. 1980 నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ చిత్రంలో రానా పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.

Sai Pallavi Birthday Posters

శేఖర్ కమ్ములతో మరో మ్యాజిక్ కు రెడీ

ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్యకు జోడీగా ‘లవ్ స్టోరీ’ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ లో సాయి పల్లవి వర్షంలో ఆడుతూ పాడుతున్న అందంగా కనిపిస్తుంది. ఇంకా 15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్న ఈ చిత్రం లాక్ డౌన్ అవగానే పూర్తి చేసే యోచనలో ఉంది చిత్ర బృందం. ఇప్పటికే విడుద‌లైన చిత్ర ఫస్ట్ లుక్ మరియు ‘ఏయ్ పిల్లా’ పాటలకు విశేష‌మైన స్పంద‌న ల‌భించింది.

లవ్ స్టోరీ