‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఆంథమ్‌ విడుదల, మనసుకు హత్తుకునేలా సాగే టైటిల్ సాంగ్

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఆంథమ్‌ సైనికుడి గొప్పతనాన్ని చాటి చెప్పుతూ సాగే విధానం మనసుకు హత్తుకునేలా ఉంది.
శంకర్‌ మహదేవన్‌ అద్బుతమైన గాత్రానికి తోడు దేవీ శ్రీ సంగీతం కట్టిపడేసాల ఉంది. సైనికుల గొప్పతనం, వారి విలువ
తెలియజేస్తూ సాగే ఈపాటను ఈరోజు (23.12.2019) విడుదల చేసింది చిత్ర బృందం.

‘భగ భగ భగ భగ మండే నిప్పుల వర్షమొచ్చినా.. జనగణమన అంటూనే దూకే వాడే సైనికుడు’ అంటూ సాగే ఈ థీమ్‌ సాంగ్‌‌ చాలా బాగుంది అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశాడు.

సౌత్ ఈస్ట్ యూరప్ కు చెందిన మేసెడోనియన్‌ సింఫనీ ఆర్కెస్ట్రా బృందంతో ఈ పాటను రికార్డ్ చేశాడు సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం జనవరి 11, 2020 న ప్రేక్షకుల ముందుకు
రానుంది. మొదటిసారిగా రశ్మిక మందన, మహేష్ బాబుకు జోడీగా కనిపిస్తుంది.