సరిలేరు నీకెవ్వరు గొడ్డలితో మహేష్ బాబు దసరా పోస్టర్ విడుదల

సరిలేరు నీకెవ్వరు దసరా పోస్టర్

మహేష్ బాబు ఫాన్స్ కి దసరా కానుక వచ్చేసింది. ప్రిన్స్ మహేష్ తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ కొత్త పోస్టర్ ను సినీ బృందం
విజయదశమి పండగ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

ఈ పోస్టర్ లో మహేష్ బాబు ఒక చేతిలో గొడ్డలి పట్టుకొని కొండారెడ్డి బురుజు ముందు నిల్చొని ఉన్నాడు. ఈ పోస్టర్ ను విడుదల చేస్తూ ‘సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో ఆయుధ పూజ. ఇదిగో దసరా కానుక, అందరికీ దసరా శుభాకాంక్షలు !’ అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి పోస్ట్ చేశారు.

అయితే బోర్డర్ లో ఉండాల్సిన మహేష్ కర్నూల్ కొండారెడ్డి బురుజు వద్ద ఎవరికోసం గొడ్డలి పట్టాడో తెలియాలంటే వచ్చే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.