Solo Brathuke So Better Theme Video సోలో బ్రతుకే సో బెటర్ థీమ్ వీడియో
కోపం, ఇష్టం, విచారం, సంతోషం, ఆనందం, బాధ.. ఇవన్నీ కాలంతోపాటు, కారణాలతోపాటు మారిపోయే ఫీలింగ్స్… అలాగే ప్రేమనేది కూడా ఒక ఫీలింగేగా.. మారదని గ్యారంటీ ఏంటి? అంటున్నారు మన సాయి ధరమ్ తేజ్. తన తదుపరి చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ నుండి ప్రేమికుల రోజు (వాలెంటైన్స్ డే) పురస్కరించుకొని ఒక థీమ్ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం సోషల్‌మీడియా వేదికగా.
వీడియోలో ఒక స్టేజి మీద మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయ్, మథర్ థెరెసా, అబ్దుల్ కలామ్, లతా మంగేష్కర్ మరియు ఆర్ నారాయణ మూర్తిల పెద్ద కటౌట్ ఏర్పాటు చేసి ఉంటుంది. ఆ స్టేజ్ పైన హీరో సాయి తేజ్ మాట్లాడే వీడియోనే థీమ్ వీడియోగా విడుదల చేశారు. ఇంకా వీడియోలో హీరో సాయితేజ్‌తో పాటుగా సింగిల్ ఆర్మీ చెప్పే డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ డైలాగ్.. “మన గోల్ ఏంటి, నో లవ్.. మన అజెండా ఏంటి, ఫ్రీడమ్.. ఫైనల్లీ మన స్లోగన్ ఏంటి, సోలో బ్రతుకే సో బెటర్..”
‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని సుబ్బు దర్శకత్వం వహిస్తుండగా సాయితేజ్ సరసన నభా నటేశ్ కనిపించనున్నారు. తమన్ సంగీతం వహిస్తున్నాడు. మే 1, 2020న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.