Sreemukhi Bathuku Balaipoyina Bandi Comedy Show
యాంకర్ శ్రీముఖి లాక్డౌన్ వేళ సరికొత్తగా ఒక కామెడీ షో మొదలుపెట్టింది. దీని పేరే ‘బతుకు బలైపోయిన బండి’. ఒక టీవీ షో కు అనుకరణలా ఉన్న ఈ స్కిట్ లో జబర్దస్త్ ఫేం ముక్కు అవినాష్ మరియు పోవే పోరా విష్ణు ప్రియలు నటించారు.
ముక్కు అవినాష్, విష్ణు ప్రియ భార్య భర్తలుగా మరియు శ్రీముఖి జడ్జిగా కనిపించారు ఈ స్కిట్ లో. ఇక షో మొదలవగానే శ్రీముఖి మాట్లాడుతూ ‘మీరు సంక్రాంతికి RRR వస్తుందనే విషయం వైన్ ఉంటారు. కాని ఈ కరోనా సీజన్ కి మీ ముందుకు వస్తుంది మీ బీబీబీ, అంటే బతుకు బలైపోయిన బండి. నా పేరు మందారం, నా షో కు వచ్చినోళ్ళందరికీ నేనే ఆధారం. కరోనా వల్ల మరణాలు సంభవిస్తున్నాయని అందరికీ తెలుసు. కానీ, అదే కరోనా వల్ల కాపురాలు కూలి పోతున్నాయన్న విషయం మా ఈ బతుకు బలైపోయిన బండి కి మాత్రమే తెలుసు’ అంటూ షో కాన్సెప్ట్ చెప్పుకొస్తుంది.
ఇక ముక్కు అవినాష్ (రాములు), విష్ణు ప్రియ (నాగమణి) కాపురంలో వచ్చిన గొడవలను శ్రీముఖి ఎలా పరిష్కరించిందో తెలుసుకోవాలంటే మీరు చూడాల్సిందే.
మధ్యమధ్యలో వచ్చే కొన్ని పంచ్ డైలాగులు చూద్దాం. Sreemukhi Bathuku Balaipoyina Bandi Comedy Show
- మందంగా పుట్టానని మందారం అని పేరు పెట్టారు.
- మీ ఇద్దరి జంట మేడ్ ఆర్ ఈచ్ అదర్ – అంటే ఇద్దరి ముక్కులు చూసి అలా చెప్పొచ్చు. ఇద్దరివీ కిలోమీటర్ వరకు ఉన్నాయి.
- ఈ లాక్డౌన్ ఇచ్చింది ఒకరినొకరికి అన్నాలు పెట్టుకోవడానికి, కన్నాలు పెట్టుకోవడానికి కాదు.
- ఈ మందారం ముందు మర్యాదగా ఉండండి, లేకపోతే మట్టిలో కలిపేస్తా.
- అసలు భార్య భర్తల రిలేషన్ గురించి ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా.. “The Relationship Between Husband And Wife Has To Be Like Soap And Soap Box, But Not Like Soap And Set Top Box”. దీన్ని బట్టి మీకేమర్థమైంది రాములు అని శ్రీముఖిని అడగగా అతను చెప్పే డైలాగు క్రింద వీడియోలో చూడండి.