మహిళా టి20 ప్రపంచ కప్ Ind Vs Ban: బంగ్లాదేశ్ పై సునాయాస విజయంతో సెమీస్ కు చేరువలో భారత జట్టు
టీ20 మహిళా ప్రపంచకప్ సెమీఫైనల్ లో కాలుమోపడానికి భారత్ ఒక అడుగు దూరంలో ఉంది. ఒక విధంగా దాదాపుగా సెమీఫైనల్ లో స్థానం ఖరారు చేసుకున్నట్టే. సోమవారం బంగ్లాదేశ్ తో పెర్త్ వేదికగా జరిగిన గ్రూప్-ఏ లీగ్ మ్యాచ్ లో భారత మహిళా జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. షఫాలి వర్మ అదిరిపోయే ఆరంభం, జెమిమా రోడ్రిగ్స్ సమయోచిత ఇన్నింగ్స్, చివర్లో వేద కృష్ణమూర్తి బ్యాట్ జులిపించడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత […]
