Home » Cricket » మహిళా టి20 ప్రపంచ కప్ Ind Vs Ban: బంగ్లాదేశ్ పై సునాయాస విజయంతో సెమీస్ కు చేరువలో భారత జట్టు

మహిళా టి20 ప్రపంచ కప్ Ind Vs Ban: బంగ్లాదేశ్ పై సునాయాస విజయంతో సెమీస్ కు చేరువలో భారత జట్టు

టీ20 మహిళా ప్రపంచకప్ సెమీఫైనల్ లో కాలుమోపడానికి భారత్ ఒక అడుగు దూరంలో ఉంది. ఒక విధంగా దాదాపుగా సెమీఫైనల్ లో స్థానం ఖరారు చేసుకున్నట్టే. సోమవారం బంగ్లాదేశ్ తో పెర్త్ వేదికగా జరిగిన గ్రూప్-ఏ లీగ్ మ్యాచ్ లో భారత మహిళా జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.

షఫాలి వర్మ అదిరిపోయే ఆరంభం, జెమిమా రోడ్రిగ్స్ సమయోచిత ఇన్నింగ్స్, చివర్లో వేద కృష్ణమూర్తి బ్యాట్ జులిపించడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.

investment

ఇక బౌలింగ్ లో పూనమ్ యాదవ్ మరియు శిఖా పాండేలు రాణించడంతో 143 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేయగలిగింది.

గ్రూప్-ఏ లో ఆడిన రెండు మ్యాచ్ లు గెలిచి నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది భారత మహిళా జట్టు. టోర్నమెంట్ మొదటి మ్యాచ్ లో ప్రస్తుత విజేత ఆస్ట్రేలియా కు మన జట్టు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇండియా తన తదుపరి రెండు గ్రూప్ మ్యాచ్ లను మెల్ బోర్న్ వేదికగా న్యూజిలాండ్ మరియు శ్రీలంకతో గురువారం మరియు శనివారం ఆడుతుంది.

మహిళా టి20 ప్రపంచ కప్ Ind Vs Ban

స్కోర్లు: భారత్ 20 ఓవర్లలో 142/6 (షఫాలి వర్మ 39, జెమిమా రోడ్రిగ్స్ 34, వేద కృష్ణమూర్తి 20*; సల్మా ఖాతున్ 2/25, పన్నా ఘోష్ 2/25) బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 124/8 (నిగర్ సుల్తానా 35, ముర్షిదా ఖాన్ 30; పూనం యాదవ్ 3/18, శిఖా పాండే 2/14, అరుంధతి రెడ్డి 2/33)

భారత్ 18 పరుగుల తేడాతో బంగ్లా పై విజయం.

Also Read: ఆసీస్ ను చిత్తు చేసిన భారత్

1 thought on “మహిళా టి20 ప్రపంచ కప్ Ind Vs Ban: బంగ్లాదేశ్ పై సునాయాస విజయంతో సెమీస్ కు చేరువలో భారత జట్టు”

  1. Pingback: మహిళా టి20 ప్రపంచ కప్ Ind Vs NZ - కివీస్ కు షాక్ ఇచ్చి వరసగా మూడో విజయంతో

Comments are closed.

Scroll to Top