Telangana Corona Virus Updates 4th April
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 4, 2020 నాడు మొత్తం 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 272కు చేరింది.
“తెలంగాణలో కరోనా వైరస్ తో ఇప్పటివరకు 11 మంది మృతి చెందారు. ఈరోజు ఒక్కరు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.మొత్తం 33 మంది కోలుకున్నారు. 228 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు”. అని తెలంగాణ ఆరోగ్య శాఖ ట్విట్టర్ ద్వారా తెలియ జేసింది.
Telangana Corona Virus Updates 4th April
ప్రస్తుతం నమోదయిన పాజిటివ్ కేసులన్నీ ఢిల్లీ వెళ్ళొచ్చినవి మరియు వారిని కలిసినవి. అయితే మర్కజ్ నుండి రాష్ట్రానికి వచ్చిన 1090 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణాలో మొత్తం ఆరు (6) ల్యాబ్ ల సహాయంతో 24 గంటలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోజుకు మూడు షిఫ్టుల చొప్పున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలిలో 1500 పడకలతో కరోనా కేసులకు చికిత్స నిమిత్తం మరో రెండు రోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.
జిల్లాల వారీగా కేసుల సంఖ్య – 04 ఏప్రిల్ 2020
హైదరాబాద్ లో ఈరోజు వరకు 93 పాజిటివ్ కేసులతో మొదటి స్థానంలో ఉండగా ఉమ్మడి వరంగల్ అర్బన్ 23 కేసులతో రెండో స్థానంలో ఉంది. ఆ తరువాత నిజామాబాద్ (18), కరీంనగర్ (16)లు ఉన్నాయి.
Also Read: 3rd April TS Corona Cases