Today Corona Cases In Telangana 03rd April 2020
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏప్రిల్ 3, శుక్రవారం నాడు ఒక్కరోజే 75 నమోదయ్యాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ సాయంత్రం 7 గంటలకు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో 75 కొత్త కేసులు నమోదు కాగా ఇద్దరు వైరస్ భారిన పది చనిపోయారని తెలిపింది.
దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 229 కు చేరింది. అలాగే ఈరోజు మరో 14 మందిని డిశ్చార్జ్ చేశారు, వీరితో కలిపి ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 32కు చేరింది. ప్రస్తుతం ఐసొలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న కరోనా రోగుల సంఖ్య 186.
ఈరోజు చనిపోయిన ఇద్దరితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా మహమ్మారికి బలైన వారి సంఖ్య 11కి చేరింది. ఈరోజు చనిపోయిన వారిలో ఒకరు సికింద్రాబాద్ కు చెందిన వారు కాగా మరొకరు షాద్ నగర్ కు చెందిన వ్యక్తి.
ఇప్పటి వరకు ఢిల్లీ మర్కజ్ కు వెళ్లొచ్చిన వారందరినీ గుర్తించి ఐసొలేషన్ వార్డులకు చేర్చామని, యుద్ధప్రాతిపదికన పరీక్షలు చేస్తున్నట్టు మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు.