Telangana Tejam Song Lyrics – KCR (Keshava Chandra Ramavath)

Telangana Tejam Song Lyrics

Telangana Tejam Song Lyrics గోరెటి వెంకన్న అందించగా, చరణ్ అర్జున్ సంగీతాన్ని సమకూర్చగా మనో, కల్పన మరియు గోరెటి వెంకన్న పాడిన ఈ పాట ‘కేశవ చంద్ర రమావత్’ సినిమాలోనిది.

Telangana Tejam Song Lyrics

మనో: పదగతులు స్వరజతులు పల్లవించిన నేల
తేనె తీయని వీణ రాగాల తెలగాణ
ద్విపద దరువుల నేల
యక్ష జ్ఞానపు శాల
పోతనా కవి యోగి
భాగవత స్కందాల

జయ గీతికై మోగెరా
తెలగాణ… జమ్మి కొమ్మై ఊగెరా
సింగిడై పొంగిందిరా… తెలగాణ
తంగెడై పూసిందిరా

కల్పన: శాతవాహన వీరశౌర్యమే తెలగాణ
ఇక్ష్వాక పాలనలో విలసిల్లే తెలగాణ
చాళుక్య ప్రాకార గోపురాదామాల
కాకతీయులె మేటి వారికెవ్వరు సాటి

మనో: ఎన్నెలా తిన్నెలా
ఎగిసేటి గోదారి
కొండకోనల మేన
కులికె కృష్ణావేణి
వన్నెలొలికే రాణి
మన కిన్నెరాసాని
చిలక వాగుల మేళ
చిందులేసే నేలా

కల్పన: శిలల కలతోరణం
యాదాద్రి దేవలం
వెలిసిన శివరేడు
వేములాడ జూడు
ధర్మపురిలో ప్రణవ నాదమే కదలాడు
వాసిగా చదువంపే… బాసరా తీర్థంబు

గోరేటి: అంబ జోగులాంబ
ఆదిలో పీఠంబు
అల్లంపురం నదుల
తొలి నివాసంబది

మనో: సమ్మక్క సారలమ్మ… తెలగాణ
రుద్రమ్మ రుధిర జన్మ

కల్పన: భద్రాద్రి రామసీతం… తెలగాణ
గోల్కొండ గొప్ప చరితం

గోరేటి: పాల్కురికి సోమన్న
బసవా పురాణంబు
దివి నుంచి దిగివచ్చి
కొలువైన తేజంబు
రామప్ప మందిరం
వేయి స్తంభాలయం
పద్యానికందము అప్పకవి చందము

కల్పన: రంగనాదా
రామాయణా గానము
ప్రతి ముంగిలి
పరవశించి పాడుకుంది
కావ్య జగతికి దారి మల్లినాదసూరి
మధుర విజయము రాసే గంగావతి దేవి

మనో: మారన్న తెనుగన్న
సోమనార్యుల గన్న
ఈనేల సాహిత్య
వైభవానా మిన్న
బతుకమ్మ భోనాలురా
పండగా సాయన్న గుండెసడిరా

కల్పన: పైడి జయరాజు కాంతారావు
ప్రభాకరుడి చిత్ర వెలుగు

గోరేటి: జై బోలో తెలంగాణ అన్న
నిమ్మల శంకరన్నా.

కల్పన: నాట్య రీతుల తెలిపె
నృత్య రత్నావళి
రసగంగనుప్పొంగే సింగభూపాలుడు
రౌద్ర పేరిణి బేరి జాయపాసేనాని
రాగమై రంజిల్లె రామదాసుని బాణి

మనో: యోగియై చరియించే
వరకవి సిద్ధప్ప
సిందేసి తాళము ఎల్లమ్మ మేళము
నూటొక్క రాగాల పోటెత్తె కిన్నెర
భాగయ్య అల్లిక రాగాల మల్లిక

కల్పన: కనుల ఎర్రని జీర
కాళోజి కవి ధార
ఎల్లలే దాటింది
దాశరధి పద్యంబు
రాక మాచర్ల
వెంకటదాసు యాలలు
రాళ్ల కరిగించె
చెన్నాదాసు రాగాలు

మనో: ఇద్దాసు తత్వాలు
ఇలపైన సత్యాలు
వేపూరి కీర్తనకు ప్రతి పల్లె నర్తనా.

గోరేటి: తూటవలె సుద్దాల హనుమంతు కవిపాట
యుద్ధ నౌకా గద్దరన్న జనగీతికా

కల్పన: విశ్వంభర జ్ఞానపీఠీ సినారే
వల్లంకి తాళమై వొలికె నీ కవనాలె

మనో: అపర మేధావి మన పీవిరా
మిద్దె రాములు ఒగ్గుకథరా

మానో & కల్పన: వేల గొంతుకల ధ్వని గానము
మన వేణు మాధవుడి
శిష్య గణము..

మనో: బందగీ నెత్తుటి
సింధూరమీనేల
బరిగీసి నిలిచెరా
భీమిరెడ్డి భళా.

కల్పన: ఆరుట్ల రావినారాయణుని త్యాగాల
కొమరము భీముడి… సమర చైతన్యాల

మనో: కమలమ్మ,ఐలమ్మ,
మల్లు స్వరాజ్యాల
కదనాల మగువల
తెగువరా తెలగాణ

కల్పన: మలిపోరు తొలిపొద్దు
మన చంద్రశేఖరుడు
కల నిజముచేసిన
మన కథానాయకుడు…

మానో & కల్పన: ఎన్ని ఘనతలు ఇచ్చటా
తెలగాణ… ఎన్నడొడవని ముచ్చటా

కో: తెలగాణ తెలగాణ తెలగాణ
తెలగాణ తెలగాణ తెలగాణ.

Watch తెలగాణ Lyrical Video

Telangana Tejam Song Lyrics Credits

KCR (Keshava Chandra Ramavath) Telugu Movie 
Director‘Garudavega’ Anji
ProducerRocking Rakesh
SingerMano, Kalpana
MusicCharan Arjun
LyricsGoreti Venkanna
Star CastRocking Rakesh, Ananya Krishnan
Music Label & Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *