Telugu Film HIT Will Stream On Prime Video
శైలేష్ కొలను దర్శకత్వంలో 28 ఫిబ్రవరి 2020 నాడు విడుదలై విమర్శకుల ప్రశంశలు అందుకున్న హీరో విశ్వక్ సేన్ నటించిన తెలుగు చిత్రం ‘HIT’. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రీమియం ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
ఏప్రిల్ 1, 2020 నుండి ఈ HIT చిత్రం అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానుంది. న్యాచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జంటగా రుహని నటించింది.
Telugu Film HIT Will Stream On Prime Video
వేదిక: ప్రైమ్ వీడియో
కథ: ఒక రకమైన మానసిక రుగ్మతతో బాధ పడుతున్న 30 సంవత్సరాల విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ హైదరాబాద్ లో తన గర్ల్ ఫ్రెండ్ మరియు ప్రీతీ అనే అమ్మాయి అదృశ్యమైన కేసును ఎలా ఛేదించాడో అనేదే ప్రధాన కథ.
దర్శకుడు: శైలేష్ కొలను
నిర్మాతలు: నాని, ప్రశాంతి తిపిర్నేని
సంగీతం: వివేక్ సాగర్
ప్రొడక్షన్ హౌస్: వాల్ పోస్టర్ హౌస్
సినిమా నిడివి: 125 నిమిషాలు
డిజిటల్ మీడియాలో ప్రసారం: 01 ఏప్రిల్ 2020
థియేటర్ లో విడుదల: 28 ఫిబ్రవరి 2020
ఎవరు చూడాలి: 16+
HIT Movie Trailer