తెలుగు సినిమాలు క్రిస్మస్ పోస్టర్లతో సందడి – Telugu Movies Christmas Posters

Telugu Movies Christmas Posters

Telugu Movies Christmas Posters

ఏ పండగ వచ్చినా కొత్త పోస్టర్లు విడుదల చేస్తుంటాయి చిత్ర బృందాలు. ఇది ఆనవాయితీగా వస్తూ అలవాటుగా మారిపోయింది.
క్రిస్మస్ పండగ సందర్భంగా టాలీవుడ్ లో పలు చిత్రాల పోస్టర్లు విడుదలయ్యాయి. అయితే ఈ క్రిస్మస్ పండగకు విడుదలైన పోస్టర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మహేష్, మందన సరిలేరు నీకెవ్వరు

sarileru neekevvaru christmas poster

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడుగా, రశ్మిక మందన కథానాయికగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు.’ ఈ చిత్రానికి సంబందించిన క్రిస్మస్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. రశ్మిక, మహేష్ జంటగా ఉన్న ఈ పోస్టర్ ఎంత ముద్దుగా ఉన్నాడు అంటూ హీరోయిన్, హీరో వెనకాల నుండి హగ్ చేసుకున్న ఫోటో బాగుంది. సంక్రాంతి కానుకగా 11 జనవరి 2020న ప్రేక్షకుల ముందుకు రానుంది.

దర్బార్ – మీరు సూపర్ స్టార్

darbar christmas poster

స్టైలుకు మారు పేరు రజనీ కాంత్. ఆరు పదుల వయసులోను కుర్రాడిలా కనిపిస్తున్న పోస్టర్ ను క్రిస్మస్ పండగ పురస్కరించుకొని ఈరోజు విడుదల చేసింది చిత్ర యూనిట్. పోస్టర్ లొ రజనీ తనదైన స్టైల్లో నడుస్తున్న విధానం అదిరింది. ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో వస్తున్న ‘దర్బార్’ చిత్రం 09 జనవరి 2020న విడుదలకు సిద్దమైంది.

నేచురల్ హిట్ కోసం విశ్వక్

hit movie christmas poster

‘ఫలక్‌నుమా దాస్‌’ చిత్రంతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న విష్వక్‌ సేన్‌ కథానాయకుడిగా ‘హిట్‌’ సినిమాతో మరోమారు తన అదృష్ఠాన్ని పరీక్షించుకుంటున్నాడు. నేచురల్‌ స్టార్‌ నాని వాల్‌పోస్టర్‌ సినిమా పతాకంపై సమర్పిస్తున్న ‘హిట్’ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను క్రిస్మస్ పండగకు విడుదల చేసింది చిత్రబృందం.

బన్నీ, బుట్టబొమ్మ ‘అల వైకుంఠపురములో’

alavaikuntapuram lo christmas poster

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఇప్పటికే విడుదలైన పాటలతో పాటు, టీజర్ చిత్రంపై హైప్ క్రియేట్ చేశాయి. బన్నీ సరసన పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తుంది. సంక్రాంతి కానుకగా 12 జనవరి 2020న విడుదల అవుతుంది. క్రిస్మస్‌ పండుగ కానుకగా విడుదల చేసిన పోస్టర్ లో ఒకరినొకరిని హత్తుకుని అల్లు అర్జున్‌, పూజాహెగ్డేలు నడుస్తూ కనిపించారు.

ఎంత మంచి వాడవురా!

entha manchi vaadavura christmas poster

నందమూరి కల్యాణ్‌రామ్‌, మెహరీన్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎంత మంచివాడవురా!’. సంక్రాంతి పండుగకు అలరించనున్న ఈ చిత్రం పోస్టర్ క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని చిత్రబృందం విడుదల చేసింది. జనవరి 15, 2020న విడుదలకు సన్నద్దమైంది.