Today Corona Cases In Telangana.
06/06/2020
రాష్ట్రంలో ఇప్పటి వరకు అత్యధికంగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే అత్యధికంగా 10 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో ముగ్గురు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చనిపోయారు.
ఈరోజు నమోదయిన కేసుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
- జిహెచ్ఎంసి పరిధి – 152
- రంగారెడ్డి – 10
- మేడ్చల్ – 18
- నిర్మల్ – 05
- యాదాద్రి – 05
- మహబూబ్ నగర్ – 04
- జగిత్యాల, నాగర్ కర్నూల్ – 02
- మెహబూబాబాద్, వికారాబాద్, జనగాం, గద్వాల్, నల్గొండ, భద్రాద్రి, కరీంనగర్, మంచిర్యాల – 01
ఈరోజు వరకు తెలంగాణాలో కరోనా వల్ల 123 మరణాలు సంభవించగా మొత్తం కేసుల సంఖ్య 3496కు చేరింది. ఇంకా 1663 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తంగా 1710 మంది వైరస్ బారి నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
తెలంగాణాలో కరోనా కేసులు – మే 17న
తెలంగాణాలో మే 17న మరో 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 21 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1551 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
- జిహెచ్ఎంసి పరిధి – 37 కేసులు
- వలస కూలీలు – 03 కేసులు
- రంగారెడ్డి – 02 కేసు
ఇప్పటి వరకు (17 మే 2020) కరోనా వైరస్ కేసుల వివరాలు తెలంగాణ వ్యాప్తంగా….
- మొత్తం కేసుల సంఖ్య – 1551
- డిశ్చార్జ్/ నయమైన వారు – 992
- ఆక్టివ్ కేసులు – 525
- మరణాలు – 34
తెలంగాణాలో మే 16న కరోనా కేసులు
మే 16 శనివారం తెలంగాణ రాష్ట్రంలో 55 కరోనా వైరస్ నమోదయ్యాయి. ఈరోజు కొత్త కేసుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. ఈరోజు వరకు హైదరాబాద్ లో అత్యధికంగా 168 కుటుంబాలు వైరస్ బారిన పడ్డాయి. ఆ తరవాతి స్థానంలో రంగారెడ్డి (59).
- జిహెచ్ఎంసి పరిధి – 44 కేసులు
- వలస కూలీలు – 08 కేసులు
- సంగారెడ్డి – 02 కేసులు
- రంగారెడ్డి – 01 కేసు
ఇప్పటి వరకు (16 మే 2020) కరోనా వైరస్ కేసుల వివరాలు తెలంగాణ వ్యాప్తంగా….
- మొత్తం కేసుల సంఖ్య – 1509
- డిశ్చార్జ్/ నయమైన వారు – 971 (12 మంది ఈరోజు డిశ్చార్జ్ అయినవారు)
- ఆక్టివ్ కేసులు – 504
- మరణాలు – 34
15/05/2020 తెలంగాణ కరోనా బులెటిన్
మే 15న తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40. జిహెచ్ఎంసి పరిధిలో 33 కేసులు, 07 గురు వలస కూలీలు పాజిటివ్ కేసులు నమోదయినవారిలో ఉన్నారు.
- పాజిటివ్ కేసులు – 40
- మొత్తం కేసులు – 1454
- డిశ్చార్జ్/ నయమయిన వారు – 959
- ఆక్టివ్ కేసులు – 461
- మరణాలు – 34
14/05/2020 తెలంగాణ కరోనా బులెటిన్
గురువారం 14 మే రోజు రాష్ట్రంలో 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా జిహెచ్ఎంసి పరిధిలో 40, రంగారెడ్డి జిల్లా పరిధిలో 05, ఇద్దరు (02) వలస కూలీలకు వైరస్ సోకింది.
ఈరోజు వరకు 42 మంది వలస కూలీలు వైరస్ భారిన పడగా, రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాలు 34. అలాగే పాజిటివ్ కేసుల సంఖ్య 1414.
13 మే 2020న తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య
ఈరోజు (13/05/2020) తెలంగాణాలో మరో 41 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 31 కేసులు జిహెచ్ఎంసి పరిధిలో నమోదుకాగా 10 కేసులు వలస కూలీలు.
ఇద్దరు వైరస్ భారిన పడి చనిపోయారు. 38 సంవత్సరాల వయసు గల జియాగూడలో నివాసముండే మహిళ మరియు 74 సంవత్సరాల వృద్ధుడు సరూర్ నగర్ వాసి చనిపోయిన వారిలో ఉన్నారు.
కేసుల వివరాలు
- 394 ఆక్టివ్ కేసులు
- ఇప్పటి వరకు వైరస్ నయమై 939 డిశ్చార్ అయ్యారు
- మొత్తం 34 మంది చనిపోయారు
12 మే 2020 (12/05/2020) కోవిడ్-19 కేసులు
12 మే మంగళవారం నాడు తెలంగాణాలో కొత్తగా 51 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు రాష్ట్ర ప్రభుత్వం అధికార ప్రకటన విడుదల చేసింది. కరోనా వల్ల మే 12 నాడు ఇద్దరు (02) చనిపోయారు. ఈరోజు నమోదయిన కేసుల్లో 37 జిహెచ్ఎంసి పరిధిలో రాగా 14 కేసులు వలస కూలీలకు సోకినట్టు తెలిపారు.
మూస బౌలి (హైదరాబాద్) లో నివాసముండే 61 సంవత్సరాల వ్యక్తి మరియు 65 సంవత్సరాల జియాగూడ వ్యక్తి చనిపోయారు ఇవ్వాళ.
51 కొత్త కేసులతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1326 కు చేరగా, 472 ఆక్టివ్ కేసులు ఉండగా నయమై డిశ్చార్జ్ అయిన వారు 822 మంది.
ఇప్పటి వరకు తెలంగాణాలో 25 మంది వలస కార్మికులకు కరోనా వైరస్ సోకింది.
ప్రధాని రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ
11 మే 2020 (11/05/2020).
ఈరోజు రాష్ట్రంలో సోమవారం నాడు 79 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మొత్తం కేసుల సంఖ్య 1275 కాగా ఇందులో దాదాపు 735 కేసులు కేవలం జిహెచ్ఎంసి ఫరిధిలోనే నమోదయ్యాయి.
అయితే ఈరోజు వచ్చిన పాజిటివ్ కేసులన్నీ కూడా జిహెచ్ఎంసి పరిధిలోనివే. తెలంగాణాలో ఇవ్వాళ ఒక్కరోజే 50 మంది డిశ్చార్జ్ అయ్యారు, ఇప్పటి వరకు చూసుకుంటే 801 మంది మొత్తంగా డిశ్చార్జ్ అయ్యారు. కాగా 444 ఆక్టివ్ కేసులుండగా 30 మంది చనిపోయారు.
జియగూడ పరిధిలోనే 25 మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ ఇప్పటివరకు 68 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఆరుగురు చనిపోయారు, 9 మంది వైరస్ భారి నుండి కోలుకున్నారు.
మార్చి 1వ తేదీన తెలంగాణాలో మొదటి కరోనా కేసు నమోదు కాగా మార్చి నెల మొత్తములో 20 కేసుల వరకు నమోదయ్యాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏప్రిల్ 3వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 75 కరోనా పాజిటివ్ కేసులు రాగా ఆ సంఖ్యను ఈరోజు (11 మే 2020 – 79 పాజిటివ్ కేసులు) దాటేసింది.
Today Corona Cases In Telangana
Media bulletin
Date: May 11, 2020Status of positive cases of #COVID19 in Telangana. pic.twitter.com/NrEDKycKXl
— Minister for Health Telangana State (@TelanganaHealth) May 11, 2020