తెలంగాణ డిప్లొమా రెగ్యులర్ పరీక్షలు వాయిదా – త్వరలో కొత్త తేదీల ప్రకటన

తెలంగాణ డిప్లొమా రెగ్యులర్ పరీక్షలు వాయిదా

తెలంగాణాలో ఏప్రిల్ 04-04-2020 నుండి ప్రారంభం కానున్న రెగ్యులర్ డిప్లొమా పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ  స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (TS SBTET) అధికారికంగా ప్రకటించింది. త్వరలో కొత్త పరీక్ష తేదీలు ప్రకటిస్తామని విడుదల చేసిన నోటిఫికేషన్ లో తెలిపింది. అయితే, టైప్‌రైటింగ్ మరియు షార్ట్‌హ్యాండ్ పరీక్షల షెడ్యూల్‌లో మాత్రం ఎటువంటి మార్పు లేదు.

ఇప్పటికే కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా, వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు మార్చి 31 వరకు సెలవలు ప్రకటించింది.

తెలంగాణ డిప్లొమా రెగ్యులర్ పరీక్షలు వాయిదా

కోవిడ్ 19 కారణంగా రెగ్యులర్ డిప్లొమా పరీక్షలు వాయిదా వేయగా. 19 నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలు మరియు ఇప్పటికే మొదలైన ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.