ఈరోజు రాజ్‌భవన్‌లో నూతన మంత్రులుగా హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్‌కుమార్, కేటీఆర్, గంగుల కమలాకర్, మరియు సబితా ఇంద్రారెడ్డిల చేత గవర్నర్
తమిళ సై సౌందర్‌రాజన్ ప్రమాణస్వీకారం చేయించారు.
ఆ వెంటనే ముఖ్యమంత్రి కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ఆరుగురు మంత్రులకు శాఖలను కేటాయించారు.
తొలిసారిగా కేబినేట్ లో ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. నూతనంగా ఎన్నికైన మంత్రుల శాఖల వివరాలు….
- హరీశ్ రావు: ఆర్థికశాఖ
- కేటీఆర్: ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖలు
- సబితా ఇంద్రారెడ్డి: విద్యాశాఖ
- పువ్వాడ అజయ్‌కుమార్: రవాణాశాఖ
- గంగుల కమలాకర్: బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖలు
- సత్యవతి రాథోడ్: గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖలు
- జగదీష్‌రెడ్డి: విద్యుత్ శాఖ
గతంలో నీటిపారుదలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హరీష్ రావు ఈసారి కీలకమైన ఆర్థికశాఖను పోషించనున్నారు. కేటీఆర్ కు మాత్రం తిరిగి అవే శాఖలను కేటాయించారు.
జగదీశ్వర్ రెడ్డి శాఖను విద్యాశాఖ నుండి విద్యుత్ శాఖకు మార్చారు.
సాధారణ పరిపాలన, ప్రణాళిక, శాంతి భద్రతలు, నీటిపారుదల, రెవెన్యూ, మైనింగ్, మొదలగు శాఖలు సీఎం కేసీఆర్ దగ్గరే ఉన్నాయి.