Home » Lyrics - Telugu » Vaalu Kallatho Song Lyrics – Gowri Naidu, Niveditha

Vaalu Kallatho Song Lyrics – Gowri Naidu, Niveditha

by Devender

Vaalu Kallatho Song Lyrics penned by Sravani Amarapu, music composed by Sandeep Sannu, and also sung by Sandeep Sannu.

Vaalu Kallatho Song Credits

Song CategoryRomantic Melody
LyricsSravani Amarapu
SingerSandeep Sannu
MusicSandeep Sannu
ArtistsGowri Naidu, Niveditha Gowda
Music LableNivriti Vibes

Vaalu Kallatho Song Lyrics

అరెరే నా హృదయం
జారిందే నిమిషం…
ప్రేమిస్తే చాలంటుందే నిన్నీక్షణం

హో, ఆ నవ్వే సంద్రం
చినుకైందే ప్రాణం…
అలలై పొంగిందే నీ పైనే ఇష్టం

మనసారా నిన్నే… చూసానే వెన్నెల
దాసోహం అంటు… ఊహల్లో తేలనా
జన్మంతా నీతో… నీ నీడై ఉండనా
ప్రాణాలే నువ్వై వెలుగిచ్ఛావే
ఒక మాటే ప్రేమ…

వాలు కళ్ళతో వెయ్యకే వల
ఎద తాకుతు… ఓ మాయలా
గెలిచావేమో నన్నే మధుబాల
మది లోయల్లో…

ప్రేమ జల్లువై… నన్నే చేరవా
దూరమే ఇలా దూరమవ్వదా
నువ్వుంటే చాలే
కలలే నిజమవవా ఈ లోకంలో

ముద్దుగుమ్మవే అనుమానమా
మంచివాడులే బుజ్జగించగా
ప్రపంచమేగా నువ్వే తనకి ఇలా
ఓ వినవేలా..?
ఏడిపించకే చంటివానిలా
నవ్వవే మరి చందమామల
నువ్వుంటే చాలే కలలే నిజమవవా
తన లోకంలో…

నీ గుండె తడిలో నేను కలిసా
ఏదో వరమేమో…
నా మోహమడిగే ఓ యాతనే
కొంత చనువీవే…

మొదలైందేదో కవ్వింతే
నిదురలు కూడా రానందే
ఉంటున్న మైకంలోను నేనే
నీకే కోపం అందమే
నాలో తాపం రేపేనే
ఉడికించద మదినే

వయ్యారి నన్నే విడిచేది లేదుగా
ఏదేమైనా ఉంటానే తోడుగా
నా నిన్నే చూస్తూ నన్నే మరిచానుగా
మేఘాల ఒళ్లో సయ్యాటలే
మనదేగా ప్రేమ….

వాలు కళ్ళతో వెయ్యకే వల
ఎద తాకుతు… ఓ మాయలా
గెలిచావేమో నన్నే మధుబాల
మది లోయల్లో…

ప్రేమ జల్లువై… నన్నే చేరవా
దూరమే ఇలా దూరమవ్వదా
నువ్వుంటే చాలే
కలలే నిజమవవా ఈ లోకంలో

Watch వాలు కళ్ళతో Video Song

You may also like

Leave a Comment