Vedukalo Song Lyrics శనపతి భరద్వాజ్ పాత్రుడు అందించగా, జై క్రిష్ సంగీతం సమకూర్చగా, ఐశ్వర్య, బృంద, చైతు, అఖిల్ పాడిన ఈ పాట ‘మా నాన్న సూపర్ హీరో’ చిత్రంలోనిది.
Vedukalo Song Credits
Maa Nanna Super Hero Released Date – 11 October 2024 | |
Director | Abhilash Kankara |
Producer | Sunil Balusu |
Singers | Aishwarya Daruri, Brinda, Chaitu Satsangi, Akhil Chandra |
Music | Jay Krish |
Lyrics | Sanapati Bharadwaj Patrudu |
Star Cast | Sudheer Babu, Sai Chand, Sayaji Shinde, Aarna |
Music Label & Copyright | Aditya Music |
Vedukalo Song Lyrics
వేడుకలో ఉన్నది కాలం
వేదిక ఈ కళ్యాణం…
వేడుకలో ఉన్నది కాలం
వేదిక ఈ కళ్యాణం
ఏడడుగుల మొదటి ప్రయాణం
జతగా ప్రారంభం…
అబ్బో, ఆనందాలు
అబ్బా, ఆటంకాలు
అయ్యో, ఆరాటాలు
పెళ్ళికి వచ్చెనంటా…
అల్లే సల్లాపాలు, హెయ్
గిల్లే కల్లోలాలు, హెయ్
ఎన్నో నిర్వాకాలు, హెయ్
అన్ని ఉన్నాయంట ఈ చోటా
పందిరిలో… సంతోషాల సంత
సందడిగా… ఉందే ఊరంతా
చిందులలో… మాయం చీకు చింత
ఆగేనా సాగే కేరింత..?
తొందరలో చేసే తప్పులు వంద
విందులలో హుందా గోవిందా
బంధువుగా సరదా విచ్చేసిందా
ఇదంతా ఇంకో కిష్కింధా…
పందిరిలో… సంతోషాల సంత
సందడిగా… ఉందే ఊరంతా
చిందులలో… మాయం చీకు చింత
ఆగేనా సాగే కేరింత..?
మండపమంతా బంగరు కాంతులు
నింపిన ఇంతుల నవ్వుల్లో
గర్వం చూడండోయ్
వీలైతే పొగడండోయ్
పంతులు గారి ప్రతి ఒక మంత్రం
పీ ప్పీ డుం డుం మోతలతో
పోటీ అందండోయ్
మరి పందెం కాయండోయ్
మీ అచ్చట్లు ముచ్చట్లు చాలికా
దిష్టి తీయండోయ్ జంటకి…
ఈ తప్పేట్లు తాళాల హోరులో
మర్చిపోవద్ద సంగతీ
అల్లే సల్లాపాలు, హెయ్
గిల్లే కల్లోలాలు, హెయ్
ఎన్నో నిర్వాకాలు, హెయ్
అన్ని ఉన్నాయంట ఈ చోటా
పందిరిలో… సంతోషాల సంత
సందడిగా… ఉందే ఊరంతా
చిందులలో… మాయం చీకు చింత
ఆగేనా సాగే కేరింత..?
తొందరలో చేసే తప్పులు వంద
విందులలో హుందా గోవిందా
బంధువుగా సరదా విచ్చేసిందా
ఇదంతా ఇంకో కిష్కింధా…