FROM THE 10TO5 LYRICS ARCHIVE

Veera Simha Reddy Trailer Dialogues – Balakrishna

Published: January 6, 2023

Category: Dialogue Lyrics

Veera Simha Reddy Trailer

Song Lyrics

Veera Simha Reddy Trailer Dialogues lyrics. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ట్రైలర్‌ ఈరోజు (జనవరి 06, 2023) ఒంగోలులోని అర్జున్‌ ఇన్‌ఫ్రా గ్రౌండ్‌లో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వేదిక మీద విడుదల చేశారు.

రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రానికి గోపీచంద్ మ‌లినేని దర్శకత్వం వహించారు. బాలయ్య బాబు సరసన శృతిహాసన్‌ కథానాయికగా మరియు దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలలో నటించారు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా 26 జనవరి 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది వీరసింహారెడ్డి.

బాలకృష్ణ పవర్ఫుల్ ట్రైలర్ డైలాగులు అభిమానులకు గూస్‌ బంప్స్ తెప్పించడం మాత్రం ఖాయం.

Veera Simha Reddy Trailer Dialogues

Veera Simha Reddy Trailer Dialogues

బాలయ్య: సీమలో ఏ ఒక్కడూ కత్తి పట్టకూడదని నేనొక్కడినే కత్తిపట్టా. పరపతి కోసమో, పెత్తనం కోసమో కాదు. ముందు తరాలునాకిచ్చిన బాధ్యత. నాది ఫ్యాక్షన్‌ కాదు, సీమ మీద అఫెక్షన్‌.. వీరసింహారెడ్డి..!

పుట్టింది పులిచెర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూల్‌.

Veera Simha Reddy Trailer Dialogues

అజయ్ ఘోష్: మైలు రాయికి మీసం మొలిసినట్టుండాదిరా…

Veera Simha Reddy Trailer Dialogues

హూ ఆర్ యూ..?
బాలయ్య: పది నిమిషాల్లో క్లోజయ్యే ఏ పబ్బు దగ్గరికైనా వెళ్లి నిలబడు. అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది.
(జై బాలయ్య, జై జై బాలయ్య), ఆ, అదీ.

Veera Simha Reddy Trailer Dialogues

బాలయ్య: అపాయింట్ మెంట్ లేకుండా వస్తే, అకేషన్ చూడను లొకేషన్ చూడను.
ఒంటి చేత్తో ఊచకోత… కోస్తా నా కొడకా.

Veera Simha Reddy Trailer Dialogues

వరలక్ష్మీ శరత్ కుమార్: పగోడు పంపుతున్న పసుపు కుంకాలతో బతుకుతాంటే
ముత్తైదువులా లేనూ, ముండమోపిలా ఉన్నా.

Veera Simha Reddy Trailer Dialogues

బాలయ్య: సంతకాలు పెడితే బోర్డుమీద పేరు మారుతుందేమో, కానీ, ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు.

Veera Simha Reddy Trailer Dialogues

పదవి చూసుకొని నీకు పొగరేమో, బై బర్త్ నా డిఎన్ఏ (DNA) కే పొగరెక్కువ.

Watch వీరసింహారెడ్డి Trailer

Music: Thaman
Video Label: Mythri Movie Makers

💬 WhatsApp