వివో ఎస్ 1 ప్రో: చైనా ఫోన్ల తయారీ సంస్థ వివో ఈ క్యాలెండర్ సంవత్సరంలో తన మొదటి స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఫోన్ వెనుక భాగంలో డైమండ్ ఆకారంలో ఉన్న 48 మెగాపిక్సెల్ లెన్స్ ఆధారిత క్వాడ్-కెమెరా సెటప్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
మరియు 8 జీబి ర్యామ్, 128 జీబి స్టోరేజ్ తో వివో ఎస్1 ప్రొ ఇండియా మార్కెట్ లోకి తెస్తుంది వివో. వివో ఎస్1 ను ఆగష్టు
2019న ఇండియాలో విడుదల చేసిన విషయం తెలిసిందే.

వివో ఎస్1 ప్రొ ధర ఇండియాలో రూ.19,900/-. సింగిల్ వేరియంట్‌లో విడుదల చేసిన ఈ ఫోన్ మిస్టిక్ బ్లాక్, జాజీ బ్లూ మరియు డ్రీమి వైట్ వంటి మూడు కలర్లలో లభించును.

వివో ఎస్ 1 ప్రో ప్రత్యేకతలు

ఓఎస్: ఆండ్రాయిడ్ వి 9.0 (పై) – ఫన్‌టచ్ ఓఎస్ 9.2

డిస్ ప్లే: 6.38 ఇంచులు (16.21 సెం.మి) – సూపర్ అమోలెడ్

ప్రాసెసర్: క్వాలకమ్ స్నాప్ డ్రాగన్ 665 ఎస్సోసి

ర్యామ్: 8 GB

మెమరీ: 128 GB, మైక్రో SD కార్డ్ ఉపయోగించి 256GB వరకు విస్తరించవచ్చు

బ్యాటరి: 4450 mAh

వెనక కెమెరా: 48MP + 8MP + 2MP + 2MP

బయోమెట్రిక్స్: ఇన్-డిస్ప్లే వేలిముద్ర సెన్సార్

VIVO S1 Pro Price