దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు భారత్ ఘనవిజయం: విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ లో భారత్ భారీ విజయాన్ని
నమోదు చేసింది. దీంతో మూడు టెస్టుల సీరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం ఆట ఆఖరి రోజు భారత బౌలర్ల దాటికి 191 పరుగులకే కుప్పకూలింది.
395 పరుగుల లక్ష్యంతో శనివారం తమ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి 11 ఓపెనర్ ఎల్గర్ వికెట్ చేజార్చుకొని, ఓవర్ నైట్ స్కోర్
11/1 వద్ద ఆదివారం ఇన్నింగ్స్ ఆరభించిన సఫారీలు భారత్ బౌలింగ్ ముందు నిలవలేక చేతులెత్తేశారు. ఒకానొక దశలో 70 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో డేన్ పీట్ (56), ముత్తు సామి (38) లు 9వ వికెట్ కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివరి రెండు వికెట్లు తీసిన వెంటవెంటనే తీసిన షమి మొత్తంగా 5 వికెట్లు తీసుకున్నాడు. మ్యాన్ అఫ్ ద మ్యాచ్ రోహిత్ శర్మ కు దక్కింది. రెండో టెస్ట్ పూణే వేదికగా 10 అక్టోబర్ న జరుగుతుంది.
విశాఖ మొదటి టెస్ట్ మ్యాచ్ హైలైట్స్ (ఇండియా Vs సౌతాఫ్రికా)
- ఓపెనర్ గా మొదటి మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీలు బాదిన రోహిత్ శర్మ సరికొత్త రికార్డు
- ఒక టెస్ట్ మ్యాచ్ లో అత్యధిక సిక్స్ లు (13) కొట్టి రికార్డు నెలకొల్పిన రోహిత్ శర్మ
- మొదటి సెంచరీనే డబల్ సెంచరీగా మలిచిన మయాంక్ అగర్వాల్
- ఒక టెస్ట్ మ్యాచ్ లో అత్యధిక సిక్స్ లు (37) నమోదైన మ్యాచ్ గా విశాఖ టెస్ట్ మ్యాచ్
- 350 టెస్ట్ వికెట్లను తక్కువ మ్యాచ్ ల్లో (66) సాధించిన ఘనత అశ్విన్ సొంతం చేసుకున్నాడు ముత్తయ్య మురళీధరన్ తో సంయుక్తంగా