Home » 2023 Telugu Movies » Yellamma Song Lyrics – Bheemadevarapally Branchi

Yellamma Song Lyrics – Bheemadevarapally Branchi

Yellamma Song Lyrics penned by Sanjay Mahesh Varma, music composed by Charan Arjun, and sung by Vollala Vani & Nalgonda Gaddar from Telugu cinema ‘భీమదేవరపల్లి బ్రాంచి‘.

Yellamma Song Credits

Bheemadevarapally Branchi (Ifsc Xxxx15) Movie – 
DirectorRamesh Cheppala
ProducersDr. Bathini Keerthi Latha Goud, Ch. Raja Narender
SingersVollala Vani, Nalgonda Gaddar
MusicCharan Arjun
LyricsSanjay Mahesh Varma
Star CastAnjibabu, Prasanna, Abhi Ram, Roopa Srinivas
Music Label & Source

Yellamma Song Lyrics

అమ్మ జగదాంబ భ్రమరాంబ
మమ్ము ఆదరించవే లోకమాతా
(అమ్మ జగదాంబ భ్రమరాంబ
మమ్ము ఆదరించవే లోకమాతా)

గౌతూని కోడలా గాంభీర రాణివి
(గౌతూని కోడలా గాంభీర రాణివి)
పరుషరాముని కన్న పరమ కళ్యాణివి
(పరుషరాముల కన్న పరమ కళ్యాణివి)

బొట్టోక సేతూల, బోనమొక సేతూల
(బొట్టోక సేతూల, బోనమొక సేతూల)
గావుబిళ్ళ ఒక సేత, గటమొక సేతూల
(గావుబిళ్ళ ఒక సేత, గటమొక సేతూల)

జగదాంబ… భ్రమరాంబ
భ్రమరాంబ… జగదాంబ
అమ్మ జగదాంబ భ్రమరాంబ
మమ్ము ఆదరించవే లోకమాతా

లోకాలే ఏలేటి పరమశివునికి
పుట్టీన గారాల బిడ్డవే నువ్వు
(పుట్టీన గారాల బిడ్డవే నువ్వు)
మనసుకు నచ్చిన వాడిని పెండ్లాడి నువ్వు
దేవుళ్ళ దీవెనతో బిడ్డలగన్నావే
(మా దేవుళ్ళ దీవెనతో బిడ్డలగన్నావే)

ఈ నేలను కాపాడే కనతల్లివయ్యావే
మము సల్లగ జూసే తల్లి
నువ్వే అమ్మా ఎల్లమ్మా
(మము సల్లగ జూసే తల్లి
నువ్వే అమ్మా ఎల్లమ్మా)

భర్తను బతికించుకోగా నువు బోనం ఎత్తావే
ఆనాటి నుండి బోనాల తల్లివి అయ్యావే
(ఆనాటి నుండి బోనాల తల్లివి అయ్యావే)

[ మైసమ్మ వరపట్నమేలే
లోకమాత రేణుక ఎల్లమ్మ దేవి
రేణుక కన్నకొడుకులు పంచపాండవుల రీతి
ఐదుగురు అన్నదమ్ములు, ఆ ఆఆ ఆ ఆ ఆఆ
అందరికన్నా పెద్దవాడు నల్ల నల్లనివాడు
వల్లాని రోమాల వాడు, ప్రాణాల గుత్త
బల పరుషరాముడైనా ఆ ఆఆ ఆ ]

[ బల పరుషరాముడు, ఏయ్ ఏ ఏ
కన్నతల్లి రేణుక ఎల్లమ్మ దగ్గరికి
చేర వచ్చిండు.
అమ్మా, కన్నతల్లి రేణుక ఎల్లమ్మ దేవీ, ఏయ్
మా నానెక్కడున్నడు, ఏయ్ ]

[మా తండ్రి జాడలు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ నువ్వు
జాడలు జెప్పు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ
(మా తండ్రి జాడలు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ నువ్వు
జాడలు జెప్పపే ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ)]

[ఏ కులమైతేంది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ
ఎలిగించి చెప్పవే ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ
(ఏ కులమైతేంది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ
ఎలిగించి చెప్పవే ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ)]

[ఎల్లమ్మో ఓ ఆఆ ఆ ఆ
రేణుక ఎల్లమ్మ దేవీ, ఏయ్
మా తండ్రి జాడ జెప్పు ఏ కులమైతేంది
మా తండ్రిని తీసుకొచ్చుకొని, అమ్మో, ఆ ఆ
బాపని పిలుసుకుంటమమ్మా
మా తండ్రి జాడ జెప్పపోతే
గండ్ర గొడ్లతోని తల గద్దలా పండు దీత్తనాని ఆ ఆ ఆ ]

[బల పరుషరాముడే, ఏయ్
ఏడు పుట్ల గండ్ర గొడ్డలి దీసి
తల్లి గొంతు మీద పెట్టిండు
ఎద మీద పాదం బెట్టిండు, అరెరెరే]

కన్నతల్లిని నేను అన్నన్ని మాటలు అనకయ్య పరశరామ
(నువ్వు అనకయ్య పరుశరామా)
ఉత్త నిందలు వేసి అందరిలో నన్ను పలుసన జేయకురా
(నన్ను పలుసన జేయకురా)

ఏ పాపము ఎరుగను ఎనాడు నా మాటలు నమ్మయ్యా
(నా మాటలు నమ్మయ్యా)
ఆ దేవుడు నాకు దీవించి ఇచ్చిన బిడ్డలు మీరయ్యా
(ఆ బిడ్డలు మీరయ్యా)

మీ అమ్మొక దేవతరా
ఎంత మొక్కు తనివే తీరదురా
(ఎంత మొక్కు తనివే తీరదిరా)
అందుకే ఏడాదికోమారు
చెయ్యాలి ఎల్లమ్మ జాతరా
(చెయ్యాలి ఎల్లమ్మ జాతరా)

ఎన్నెన్నో రూపాల్లో
ఆ తల్లి మనలను సల్లంగ కాసురా
(ఎల్లమ్మా సల్లంగ కాచురా)

ఒక్కేసి డప్పాట మావురాలెల్లమ్మ
ఒక్క శివ సత్తాట మావురాలెల్లమ్మ
(ఒక్కేసి డప్పాట మావురాలెల్లమ్మ
ఒక్క శివ సత్తాట మావురాలెల్లమ్మ)

రెండేసి డప్పులు మావురాలెల్లమ్మ
రెండు శివ సత్తులు మావురాలెల్లమ్మ
(రెండేసి డప్పులు మావురాలెల్లమ్మ
రెండు శివ సత్తులు మావురాలెల్లమ్మ)

పరుశరాముడు గనుక ఏనాడు
జాంబవంతుల వాడ లోపల
జోడి యావుల గడలయందు
గోలేము కాడా ఆ ఆ ఆ ఆ

పంచ ముగ్గుల పట్నాలు ఏసి
ఎడంత్రాల బోనం సమర్పించి
రేణుక ఎల్లమ్మ దేవికి
మేకపోతుల మత్త గొలిపి, ఆ ఆ ఆ ఆ

బైండ్ల వాళ్ళు జమిడిక మోతల తోటి
ఒగ్గోల్ల డోలు సప్పుళ్ళతోటి, ఏ ఏ ఏ

ఊరోళ్ళ వాడల్లా సేను సెలకల్లా
ఎల్లమ్మా నీకు గుడులు గోపురాలంటా
(మా ఎల్లమ్మా నీకు గుడులు గోపురాలంటా)

గౌడన్నా జాంబవంతుల కుల దైవం నువ్వు
సబ్బండా వర్ణాల సొంతం అయ్యావు
(ఆ సబ్బండా వర్ణాల సొంతం అయ్యావు)

యాప రిల్లలు, యాట పోతులు
కల్లు సాకలు, వట్టి శాపలు అన్నీ నీకేలే
(ఆ కల్లు శాకలు, వట్టి శాపలు అన్నీ నీకేలే)

ఏ లోటూ రాకుండా
నీకు పూజలు జేస్తామే
మా ఇల్లూ వాకిలి, పిల్లాజెల్లలు
సల్లంగా జూడే
(మా ఇల్లూ వాకిలి, పిల్లాజెల్లలు
సల్లంగా జూడే)

Watch ఎల్లమ్మ దేవి Lyrical Video Song

Scroll to Top