ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వాయిదా వేసిన ఎలక్షన్ కమిషన్

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వాయిదా

కరోనా వైరస్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల మీద పడింది. ఏపీలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎన్.రమేష్ కుమార్ ప్రకటించారు. ప్రజాశ్రేయస్సు కోరి ఆరు వారాలు వేస్తున్నట్టు, ఆ తరువాత నెలకొనే పరిస్థితులను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నట్టు కమీషనర్ తెలిపారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వాయిదా

స్థానిక ఎన్నికలను పేపర్ బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తారు కాబట్టి ఓటు వేయడానికి అధిక సమయం పడుతుంది. మనుషులు ఒకరినొకరు తగిలే అవకాశం ఎక్కువగా ఉండడంతో కరోనా విస్తరించే అవకాశం ఉందనే తప్పని పరిస్థితుల్లో ఎన్నికలు వాయిదా వేస్తున్నామని రమేష్ కుమార్ చెప్పారు.

పార్టీలు, ఉద్యోగులు మరియు ఇతర వర్గాలతో అత్యున్నత స్థాయి సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాము. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాకే ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. అప్పుడే కొత్త షెడ్యూల్ విడుదల చేస్తామని కమీషనర్ చెప్పారు.